జబర్దస్త్ దొరబాబు పేరును టాటూ వేయించేసుకుందామె.. వైరల్

0

జబర్దస్త్ కమెడియన్స్ దొరబాబు, పరదేశిలు విశాఖ పట్నంలోని వ్యభిచార గృహంలో దొరికిపోవడం సినీ, బుల్లితెర వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. విశాఖ టాస్క్ ఫోర్స్ పోలీసులు పక్కా సమాచారంతో మంగళవారం రాత్రి మాధవధారలోని ఓ అపార్ట్‌మెంట్‌ 201 ప్లాట్‌లో దాడులు నిర్వహించి.. ఇద్దరు మహిళలతో పాటు ఏడుగురు విటుల్ని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వీరిలో జబర్దస్త్ దొరబాబుతో పాటు అతని టీంలో పనిచేసే పరదేశిలు ఉండటంతో పోలీసులు అవాక్కయ్యారు.

ప్రస్తుతం దొరబాబు, పరదేశిలు వ్యభిచార గృహంలో పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన వీడియోలు, ఫొటోలు వైరల్ అవుతున్నాయి. అయితే దొరబాబు తన భార్యతో కలిసే విశాఖపట్నం వెళ్లినట్టు తెలుస్తోంది. టిక్ టాక్ వీడియోలతో ఫేమస్ అయిన నెల్లూరు చెందిన లోకల్ ఛానల్‌ యాంకర్‌ అమూల్య రెడ్డి అలియాస్ నందినిని 2018లో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు దొరబాబు.

తరచూ ఈ ఇద్దరూ కలిసి టిక్ టాక్ వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంటారు. @ammu0574167 టిక్ టాక్ ఐడీ పేరుతో దొరబాబు భార్య అమూల్య రెడ్డి అలియాస్ నందిని (నందు) తరచూ వీడియోలు చేస్తూ ఉంటుంది. అయితే తన భర్త వ్యభిచార గృహంలో దొరికిన రోజునే ఆమె టిక్‌లో పోస్ట్ చేసిన వీడియోలపై హాట్ టాపిక్ నడుస్తోంది. డి ఫర్ దొరబాబు, మై లైఫ్ లవ్ యు సోమచ్ బుజ్జీ అంటూ టాటూ వేయించుకుంది దొరబాబు భార్య నందు. చేతిపై ఉన్న పెద్ద టాటూని కూడా అదే రోజున వేయించుకోవడం విశేషం. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-