ఏడేళ్లు జబర్దస్త్ జడ్జ్.. జీకి జంప్‌కాగానే వెకిలిపంచ్‌లేలా నాగబాబూ!

0

జంపింగ్ జపాంగ్.. ఈ మాట తరచూ పాలిటిక్స్‌లో ఎక్కువగా వినిపిస్తుంటుంది. టిక్కెట్ దక్కకపోయినా.. అధికార పార్టీ పదవి ఆశ చూపినా.. ఇగో హర్ట్ అయినా పక్క పార్టీలోకి జంప్ చేయడం రాజకీయాల్లో సాంప్రదాయంగా వస్తోంది. ఈ సాంప్రదాయం పాలిటిక్స్ నుండి బుల్లితెరవైపు షిప్ట్ చేశారు జనసేన నాయకుడు, జబర్దస్త్ జడ్జ్ నాగబాబు. ఏడేళ్లుగా జబర్దస్త్ స్టేజ్‌పై జడ్జ్‌గా పడి పడి నవ్వినవ్వి ప్రేక్షకులకు జబర్దస్త్ నవ్వుల అందించిన నాగబాబు.. ఈవీవీ జబర్దస్త్ నుండి జీ టీవీకి జంప్ చేశారు.

‘సరె.. సర్లే ఎన్నెన్నో అనుకుంటాం’ ప్రోగ్రామ్‌లో పెద్దన్నయ్యగా నాగబాబు

ఏడేళ్లు పాటు జబర్దస్త్ జడ్జ్‌గా ఉన్నారు.. జీవితాంతం అదే షోకి జడ్జ్‌గా ఉండాలనే రూల్ ఏం లేదు కాబట్టి.. ఏదైనా ప్రోగ్రామ్ కానీ, ప్రయాణం కానీ ఎక్కడో ఒక చోట ఆగాల్సిందే. నాగబాబు కూడా జబర్దస్త్ జర్నీని ఇక్కడితే ఆపేసి.. ఈటీవీకి రాం రాం చెప్పేసి.. జీ తెలుగుకి జై కొట్టారు. అంతా బాగానే ఉంది కాని.. జబర్దస్త్ నుండి బయటకు వచ్చిన తరువాత జీలో నాగబాబు జడ్జ్‌గా ‘గ్యాంగ్‌ స్టార్స్‌’ అనే కార్యక్రమం త్వరలో ప్రసారం కానుంది. దీనికి డైరెక్టర్లు నితిన్, భరత్ ద్వయం. వీరు కూడా నాగబాబుతో పాటుగా జబర్దస్త్ నుండి జీకి జంప్ చేసినవాళ్లే.

యాంకర్ ప్రదీప్ రీ ఎంట్రీ.. పక్కనే పోరీ

కాగా కార్తీకమాసం సందర్భంగా జీ తెలుగు ‘సరె.. సర్లే.. ఎన్నెన్నో అనుకుంటాం..! అన్ని జరుగుతాయా ఏంటి?’..స్పెషల్ ఈవెంట్‌ను నిర్వహిస్తోంది. వచ్చే ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రసారం కానున్న ఈ ఎపిసోడ్‌కి సంబంధించి మరో ప్రోమో విడుదల చేశారు. ఇందులో పెద్దన్నయ్యగా కనిపించబోతున్నారు నాగబాబు.

జీ తెలుగు స్టేజ్ డాన్స్‌తో షేక్ చేసిన రంగమ్మత్త

ఆయనతో పాటు అనసూయ, ధనరాజ్, చమ్మక్ చంద్ర, వేణు ఇలా జబర్దస్త్ టీం మొత్తం నవ్వులు జల్లు కురిపించేందుకు యాంకర్ ప్రదీప్‌తో కలిసి రెడీ అయ్యారు. ఇక రంగమ్మ మంగమ్మా అంటూ ఒళ్లు మొత్తం హూనం చేసేసుకుంటూ స్పెషల్ సాంగ్‌తో స్టేజ్‌ను ఊపేస్తోంది అనసూయ. ఇక శేఖర్ మాస్టర్ కొడుకు సైతం రాములో రాములో అంటూ రచ్చ చేస్తున్నాడు.

జబర్దస్త్ పై వేణు వెకిలిపంచ్‌లు.. ఎంజాయ్ చేసిన నాగబాబు

మొత్తంగా ఎంటర్‌టైన్మెంట్ డోస్‌తో పాటు సెటైర్ డోస్‌ కూడా ఇందులో ఓ రేంజ్‌లో కనిపిస్తోంది. ముఖ్యంగా కమెడియన్ వేణు అదేనండీ.. జబర్దస్త్‌ కామెడీ షోతో బాగా ఫేమస్ అయ్యాడు.. అపుడెపుడో ఏదో స్కిట్‌లో కల్లు గీత కార్మికుల్ని హేళన చేస్తూ ఓయూ విద్యార్ధులు వచ్చి కుళ్లపొడిచేశారు చూడండీ.. ఆ వేణు జబర్దస్త్ షోపై సెటైర్లు వేస్తున్నాడు. ఇందులో నాగబాబును సైతం ఇన్వాల్వ్ చేసి పంచ్ పేలుస్తున్నాడు.

మెడలో సెల్ ఫోన్‌కి తాడు కట్టుకుని పంతులుగా కనిపించి.. ‘ఇప్పుడే ఆ నాగేంద్రుడి దయ ఏదో కలుగుతున్నట్టుగా అనిపిస్తుంది. బాబు గారూ మీరు వస్తారని చెప్పానా? ఏదీ అక్కడ నుండి ఇక్కడికి వస్తారని చెప్పానా? 120 కేజీల నుండి 80 కేజీలకు వస్తారని చెప్పానా? మీతో ఇంకో ముగ్గుర్ని కూడా పట్టుకొస్తారని చెప్పానా? అదేనండీ.. మీ మేకప్ మేన్, డ్రైవర్, అసిస్టెంట్ అంటూ ఇన్ డైరెక్ట్‌గా జబర్దస్త్ షో‌కి పంచ్‌లు వేస్తుంటే.. పకా పకా నవ్వుతున్నారు నాగబాబు. పక్కనే అనసూయ (ప్రజెంట్ జబర్దస్త్ యాంకర్) సైతం నాగబాబు నవ్వుతో పోటీ పడుతోంది.

కష్టకాలంలో ఆదుకున్న జబర్దస్త్‌పై వెలికిపంచ్‌లకు నాగబాబు నవ్వులు

ఒక షో నుండి మరొక షోకి వెళ్లడం తప్పుకాదు కాని.. ఇలా ఏడేళ్లు పాటు పనిచేసిన షోపైనే జోకులు వేస్తుంటే వాటిని ఎంజాయ్ చేస్తూ నవ్వుకోవడం ద్వారా జనంలో ఇంకేం రెస్పెక్ట్ ఉంటుంది. ‘జబర్దస్త్’ షోలోకి ప్రవేశించే సమయానికి తాను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని అలాంటి పరిస్థితిలో ‘జబర్దస్త్’ తనకెంతో హెల్ప్ అయ్యిందని చెప్పుకొచ్చిన నాగబాబు. అదే జబర్దస్త్ పై వెకిలిపంచ్ వేస్తుంటే అది హస్యం అనుకోవాలో.. లేక అపహాస్యం అనుకోవాలే బాబుగారే సెలవీయాలి.
Please Read Disclaimer