జాక్ పాట్ ట్రైలర్ టాక్: జ్యోతిక… రేవతి రచ్చ

0

సీనియర్ హీరోయిన్ జ్యోతిక.. రేవతి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘జాక్ పాట్’. కళ్యాణ్ దర్శకత్వంలో హీరో సూర్య నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్ తాజాగా విడుదల అయింది. యాక్షన్ ఎంటర్టైనర్ జోనర్లో తెరకెక్కిన ఈ సినిమాలో ఆనంద్ రాజ్.. యోగిబాబు.. రాజేంద్రన్.. మన్సూర్ అలీ ఖాన్ ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా కు సంగీతం అందించినవారు విశాల్ చంద్రశేఖర్.

ట్రైలర్ ప్రారంభంలోనే జ్యోతిక రేవతిల గురించి పెద్ద బిల్డప్ ఇచ్చారు. ఆనంద్ రాజ్ తో మన్సూర్ అలీ ఖాన్ మాట్లాడుతూ “ఎవరు భాయ్ నిన్ను టెన్షన్ పెడుతున్నారు.. కొత్తగా వచ్చిన ఎస్సై ప్రభునా.. సిఐ సింహాచలమా.. ఎస్పీ పరశురామా.. డీఐజీ వెంకట స్వామా?” అని నాటుగా అడిగితే.. “వాళ్ళెవరూ కాదు భాయ్”.. అంటాడు. కట్ షాట్ లో పోలీస్ యూనిఫామ్ లో జ్యోతిక రేవతిలను పవర్ ఫుల్ గా చూపించారు. అప్పుడు ఆనంద్ రాజ్ “వాళ్ళు”అంటాడు. ఇక మన్సూర్ అలీ ఖాన్ కూడా ఆ సంగతి తెలియగానే ఉసూరుమంటాడు. ఇక జ్యోతిక.. రేవతిల ఫైట్లు… చేజ్ సీక్వెన్సులు.. కామెడీ అన్నీ ఫుల్ గా ఉన్నాయి.. ఈ లీడింగ్ లేడీస్ దెబ్బకు భయపడి ఒక దశలో విలన్ ఆనంద్ రాజ్ “నేను మీకు ఏం ద్రోహం చేశాను. నన్నెందుకు ఇలా టెన్షన్ పెడుతున్నారు” అని జ్యోతిక..రేవతిలను ప్రశ్నిస్తాడు. ఈ లేడీస్ టార్చర్ తట్టుకోలేక ఫైనల్ గా “దేవుడా.. ఇంకో జన్మలో అయినా నన్ను దాదాగా పుట్టించకు”… అంటాడు.

మరి ఎందుకు జ్యోతిక.. రేవతిలు ఆ విలన్ ను వేదనకు.. శోధనకు గురిచేస్తున్నారనేది మాత్రం ట్రైలర్ లో రివీల్ చెయ్యలేదు. పోలీస్ యూనిఫామ్స్ మాత్రమే కాకుండా.. వెటర్నరీ డాక్టర్లుగా.. సన్యాసినుల గెటప్పులో కూడా కనిపించడం చూస్తుంటే ఇదో రాబిన్ హుడ్ స్టైల్ కథేమో అనిపిస్తోంది. ట్రైలర్లో రాజేంద్రన్ కామెడీ ట్రాక్ ను చూపించారు కానీ అదేమీ తెలుగువారికి పెద్దగా కనెక్ట్ అయ్యేలా లేదు. ఓవరాల్ గా చూస్తే మాత్రం ఇలా ఒక కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్లో హీరోయిన్లు నటించడం కొత్తగా ఉంది. జ్యోతిక.. రేవతి ఇద్దరూ సూపర్ యాక్టర్స్ కాబట్టి అలవోకగా నటించారు. ఆలస్యం ఎందుకు.. ట్రైలర్ చూసేయండి.
Please Read Disclaimer