జాక్ పాట్ -ట్రైలర్ టాక్

0

మన దగ్గర హీరోయిన్లు కాస్త ఏజ్ బార్ కాగానే క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారిపోతారు కానీ తమిళ్ లో మాత్రం కొందరి తీరు మా రూటే సెపరేటు అనేలా ఉంటుంది. అందులో సూర్య సతీమణి మాజీ హీరోయిన్ జ్యోతిక ఒకరు కాగా 90వ దశకంలో అగ్ర హీరోలందరి సరసన నటించిన రేవతి మరొకరు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో రూపొందిన జాక్ పాట్ ఇప్పుడు కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా నిలుస్తోంది. దీని ట్రైలర్ అక్కడ సంచలనం రేపుతోంది.

ఇద్దరు కిలాడీ మిడిల్ ఏజ్ భామలు(రేవతి-జ్యోతిక)లు కలిసి మోసగాళ్లను బురిడీ కొట్టిస్తూ పబ్బం గడుపుకుంటూ ఉంటారు. ఓసారి పోలీస్ లాగా మరోసారి డాక్టర్ ఇలా అవసరానికి తగ్గట్టు వీళ్ళు వేయని వేషం ఉండదు. మహిళలం అనే జంకు ఇంచు కూడా లేకుండా మగరాయుళ్ళుతో ధీటుగా ఫైట్లు కూడా చేస్తుంటారు. అప్పుడే నేర సామ్రాజ్యాన్ని ఏలుతున్న ఇద్దరు డాన్ల(మన్సూర్ అలీ ఖాన్-మోహన్ రాజ్)తో వీళ్లకు వైరం ఏర్పడుతుంది. జైలుకు వెళ్తారు. అసలు ఈ ఇద్దరి వెనుక ఉన్న కథేంటి వీళ్లకు తగిలిన జాక్ పాట్ ఏంటి అనేదే అసలు కథ

ట్రైలర్ మొత్తం మాస్ మసాలాతో నింపేశారు. ఎక్కడా అసభ్యత లేకుండా గ్లామర్ ప్రస్తావన రాకుండా అవుట్ అండ్ అవుట్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ గా రూపొందిన ఈ మూవీలో జ్యోతిక ఎన్నడూ చూడని అవతారంలో విశ్వరూపంలో చూపించగా రేవతిని అప్పుడెప్పుడో మౌన రాగం తర్వాత అంత హుషారుగా చూసేది ఇందులోనే.యాక్షన్ ఎమోషన్ సెంటిమెంట్ అన్ని మిక్స్ చేసిన తీరు బాగుంది. స్టార్ లేకుండా కేవలం ఇద్దరు సీనియర్ ఆర్టిస్టులను తీసుకుని దర్శకుడు కళ్యాణ్ నడిపించడం ఆసక్తి రేపింది. విశాల్ చంద్రశేఖర్ సంగీతం బాగా ఎలివేట్ అయ్యింది. దీనికి జ్యోతిక భర్త సూర్య సోలో ప్రొడ్యూసర్ కావడం విశేషం.
Please Read Disclaimer