రీమిక్స్ వీడియో: క్లాసిక్ ని చెడగొట్టారుగా!

0

క్లాసిక్ గీతాల రీమిక్సుల జోలికి వెళితే చాలా సార్లు ఫెయిల్యూర్సే ఎదురయ్యాయి. ప్రతిసారీ విమర్శలు తప్పలేదు. ఇంతకుముందు జాక్విలిన్ ఫెర్పాండెజ్ పలు క్లాసిక్ గీతాల రీమిక్సుల్లో నర్తించి నెటిజనులతో అక్షింతలు వేయించుకుంది. ఇప్పుడు మరోసారి అలానే అయ్యింది. తాజా రీమిక్స్ గీతం జాకీకి బ్యాడ్ నేమ్ తెచ్చింది.

బిగ్ బి అమితాబ్ బచన్ ఐకానిక్ హిట్ చిత్రం `లావారిస్` నుండి `మేరే ఆంగ్నే మెయిన్..` సూపర్ హిట్ సాంగ్ రీమిక్స్ ని జాకీపై తెరకెక్కించారు. అయితే లేటెస్ట్ సాంగ్ పాత క్లాసిక్ ని ఏమాత్రం టచ్ చేయలేకపోయిందనే చెప్పాలి. ఈ వీడియో సాంగ్ లో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మంత్రముగ్ధులను చేసే రాణిగా కనిపిస్తే.. టీవీ నటుడు.. బిగ్ బాస్ ఫేం అసిమ్ రియాజ్ ఆమెతో శృంగారం చేసే కుర్రాడిగా కనిపించాడు. తనిష్ బాగ్చి ఈ పాటకు సంగీతం అందించాడు. ఇక ఈ పాట ట్యూన్ పరంగానే కాదు.. విజువల్ గానూ ఆ స్థాయిలో మెప్పించలేకపోయిందనే చెప్పాలి. ఇక ఓల్డ్ క్లాసిక్ హోలీ సాంగ్ అయితే లేటెస్ట్ రీమిక్సులో అదేమీ కనిపించనే లేదు. ఒక గ్రేట్ క్లాసిక్ ని చెడగొట్టారనే అర్థమవుతోంది.

వయసులో ఉన్న యువరాణిని ముసలాడితో పెళ్లి నిశ్చయమయ్యాక.. ఆ రాణిని నేటి జనరేషన్ కుర్రాడు ఎత్తుకొచ్చేయడం అన్న కాన్సెప్ట్ బావుంది. కానీ తీసిన విధానం మరీ అంత రక్తి కట్టించలేదు. నాటి మేటి క్లాసిక్ ని నేహా కక్కర్- రాజా హాసన్ ఆలపించారు. ఆ స్థాయిలో లేటెస్ట్ సాంగ్ ఆకట్టుకోలేదన్న విమర్శలు నెటిజనుల్లో వెల్లువెత్తుతున్నాయి.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-