స్టన్నింగ్.. గోల్డెన్ బ్యూటీ

0

బాలీవుడ్ లో అంతర్జాతీయ అందాల జోరు ఎక్కువే.. వారి సోషల్ మీడియా హోరు ఎక్కువే. అందులో ముఖ్యంగా శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు యూత్ లో క్రేజ్ చాలా ఎక్కువ. జాక్వెలిన్ ఇన్స్టా ఖాతాకు 34 మిలియన్లకు పైగా ఫాలోయర్లు ఉన్నారు. ఇక బాలీవుడ్ భామే అని మన తెలుగు ప్రేక్షకులకు తెలియదని అనుకోవాల్సిన పని లేకుండా ‘సాహో’ లో బ్యాడ్ బాయ్ సాంగ్ కు ప్రభాస్ తో కలిసి స్టెప్స్ వేసింది. తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం అయింది.

తాజాగా ఈ భామ ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు “గ్లోబల్ గిఫ్ట్ గాలాకు నన్ను అందంగా రెడీ చేసినందుకు కృతజ్ఞతలు” అనే క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫోటోలో బంగారు రంగులో ఉండే డిజైనర్ గౌన్ ధరించి క్లోజప్ పేస్టు యాడ్ కు 100 టైమ్స్ నవ్వింది. అసలే ఇంటర్నేషనల్ బ్యూటీ.. ఆపైన గోల్డెన్ కలర్ డ్రెస్.. నేపథ్యంలో అంతా గోల్డ్ కలర్ లైటింగ్.. “అసలు సిసలు 24 కారెట్ల బంగారం అంటే జాక్వెలిన్” అని బుర్ర ఉండే ఎవరికైనా అనిపించకమానదు. అలా అనిపించలేదంటే ఆ బుర్రనిండా హుస్సేన్ సాగర్ వాటర్ ఫుల్ గా ఉన్నట్టే.

ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు థ్రిల్లైపోయి సూపర్ కామెంట్స్ పెట్టారు. “స్టన్నింగ్.. గోల్డెన్ బ్యూటీ”.. “జాక్ కు సాటిలేదు”.. “ఓహ్ ఇన్స్టా లో బంగారు రంగు మంటలు”.. “బ్యూటిఫుల్ బ్యాడ్ గర్ల్” అంటూ కొందరు కామెంట్లు పెట్టారు. ఈ ఫోటోలకు ప్రీతీ జింటా లాంటి బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా లైక్స్ కొట్టారు. సినిమాల విషయానికి వస్తే జాక్వెలిన్ నటించిన చివరి చిత్రం ‘డ్రైవ్’ ను థియేటర్లలో కాకుండా డైరెక్ట్ గా నెట్ ఫ్లిక్స్ లో ఈమధ్యే రిలీజ్ చేశారు. ‘డ్రైవ్’ తర్వాత జాక్వెలిన్ కొత్త ఆఫర్లేవీ రాలేదు.
Please Read Disclaimer