బికినీ సుందరి ఘాటు శంఖారావం!

0

బాలీవుడ్ సినిమాలు రెగ్యులర్ గా చూసే ప్రేక్షకులకు పరిచయం చేయనవసరం లేని పేరు జాక్వెలిన్ ఫెర్నాండెజ్. ‘అలాదిన్’ అనే హిందీ చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ‘హౌస్ ఫుల్’ ఫ్రాంచైజీ తో పాటుగా సల్మాన్ ఖాన్ సూపర్ హిట్ ఫిలిం ‘కిక్’ లో కూడా నటించింది. ఈ భామ సోషల్ మీడియాలో మహా యాక్టివ్. ఇన్స్టా గ్రామ్ లో 31.1 మిలియన్ల ఫాలోయర్లు ఉన్నారు. హాట్ ఫోటో షూట్లతో వారిని థ్రిల్ చేయడం జాక్వెలిన్ హాబీ.

జాక్వెలిన్ శ్రీలంక బ్యూటీ అనే సంగతి తెలుసు కదా. ప్రస్తుతం ఈ భామ శ్రీలంక లోని ట్రింకోమలి లో చిల్ అవుట్ అవుతోంది. అక్కడ ఉన్న సిన్నమోన్ బీచ్ హోటల్ లో ఎంజాయ్ చేస్తూ బికిని ఫోటో షూట్ లో పాల్గొంది. ఆ ఫోటోలను తన ఇన్స్టా ఖాతా ద్వారా పోస్ట్ చేస్తూ “పెద్ద అలలు..మంచి ఫీలింగ్” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. బ్లూ కలర్ పూల డిజైన్ ఉన్న ఒక వైట్ బికిని ధరించి సూపర్ పోజులిచ్చింది. ఒక ఫోటోలో హ్యాటును సెక్సీగా పట్టుకుని హాట్ పోజిచ్చింది. మరో ఫోటోలో ఇసుకలో మోకాళ్ళపై కూర్చుని నవ్వుతూ ఓ శంఖాన్ని పట్టుకుంది. అలానే వదిలేస్తే శంఖారావం చేస్తూ కంటికి కనిపించని నెటిజన్లపై ఘాటు యుద్ధాన్ని ప్రకటిస్తుందేమో!

శ్రీలంక పాప ఫోటోలు చూసిన నెటిజన్లు ఎంతో ఎగ్జైట్ అయ్యారు.. అందుకే ఈ ఫోటోకు 1.5 మిలియన్లకు పైగా లైకులు వచ్చాయి. అలియా భట్ లాంటి భామలు ఈ ఫోటోలకు లైక్స్ కొట్టారు. ఇక జాక్వెలిన్ ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే ‘డ్రైవ్’ అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్.
Please Read Disclaimer