మేరు ‘నగ’ ధీర

0

మహా పురుషులను వర్ణించేటప్పుడు మేరునగధీర .. మేరుసమాన అనే మాటలు మన ప్రాచీన సాహిత్యంలో తరచుగా కనిపిస్తూ ఉంటాయి. హాట్ బాంబ్ కి మేల్ వెర్షన్ లా టామ్ బాయిస్ యాటిట్యూడ్ తో కనిపించే జాకీ ఈ కొత్త గెటప్ తో దర్శనమిచ్చిన తీరు చూస్తుంటే 300 జక్సిస్ మహారాజు గుర్తుకు రావడం లేదూ?

ఒళ్లంతా నగలతో అలంకరించిన ప్రత్యేకమైన గెటప్ ఆకర్షిస్తోంది. ముక్కుకు ముక్కుపుడక.. చెవులకు లోలాకులు.. ఆ కను రెప్పలకు ఐ లైనర్ .. చెవులకు తళుకుల పూసలు కనిపిస్తాయి జక్సిస్ రాజుకు. ఆ సినిమాలో నపుంసక కేటగిరీలో చూపించారు కానీ.. ఆ హైట్ వెయిట్ కి ప్రపంచవ్యాప్తంగా ఫాలోవర్స్ ఏర్పడ్డారు జక్సిస్ కి.

ఇదిగో ఇప్పుడు జాకీ అలియాస్ జాక్విలిన్ ని అంతకుమించి డిజైన్ చేయడం ఆసక్తికరం. జక్సిస్ సామ్రాజ్యంలో మహారాణిలా ఉంది ఈ బ్యూటీ. స్పార్టన్లు అయినా ఖంగు తినేలా.. జాక్విలిన్ నెవ్వర్ బిఫోర్ అన్నంతగా సంథింగ్ స్పెషల్ గా దర్శనమిచ్చింది. వజ్ర వైఢూర్యాలతో పొదిగిన 1 కేజీ బంగారు ఆభరణాలతో ఇలా జాకీని అలంకరించారా? అంటే అవుననే అనిపిస్తోంది. ఆ ముఖానికి కళ్ల మీదుగా క్రౌన్ తరహాలో చేసిన ఆ డిజైన్ ని మెచ్చుకుని తీరాలి. అర ఇంచు పొడవు ఉన్న ఆ గోళ్లకు పచ్చ కెంపులు ధరించింది. ఆ ముక్కు పెదవులు.. బుగ్గలపై నుంచి జాలువారిన ఆ స్పెషల్ లేస్ డిజైన్ అంతే కనులకు ఇంపుగా ఉంది. చేతులకు భారీగా డిజైన్ చేసిన బ్రాస్ లెట్ అంతే తళుక్కుమంటోంది. ఓవరాల్ గా జాకీ సంథింగ్ స్పెషల్ డిఫరెంట్ అని ప్రూవైంది. అందుకే ఈ అమ్మడికి సాహో చిత్రంలో ఐదు నిమిషాల పాట కోసం 3కోట్ల మేర చెల్లించుకున్నారని అంత ఇదిగా ముచ్చటించుకున్నారు ఫ్యాన్స్.
Please Read Disclaimer