బ్యాడ్ గర్ల్ కి అంతిచ్చారా?

0

జస్ట్ ఇంకో 240 గంటలు గడిస్తే చాలు సాహో అరాచకం వెండితెరపై ప్రత్యక్షమవుతుంది. ఇప్పటికే విడుదల కోసం భారీ స్వాగతం చెప్పేందుకు ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు. ఇదిలా ఉండగా నిన్న రిలీజ్ చేసిన బ్యాడ్ బాయ్ వీడియో సాంగ్ ఆన్ లైన్ లో మాములు రచ్చ చేయడం లేదు. ఇప్పటికే ట్రెండింగ్ లో టాప్ 3లోకి వచ్చేసింది. లిరికల్ రూపంలో కాకుండా ఏకంగా 2 నిమిషాల వీడియోని వదలడం పెద్ద ప్లస్ పాయింట్ గా మారింది.

ముఖ్యంగా ప్రభాస్ మ్యాచో మ్యాన్లీ లుక్స్ కి జాక్వలిన్ ఫెర్నాండేజ్ అందాలు తోడవ్వడంతో ఇది రిపీట్ మోడ్ లో చూస్తున్న వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. అందులోనూ స్టన్నింగ్ విజువల్స్ సూపర్బ్ అనిపించే లొకేషన్స్ ఇన్ని తోడైతే ఫ్రీగా చూసే అవకాశాన్ని ఎవరు మాత్రం ఎందుకు వదులుకుంటారు. అయితే జాక్వలిన్ కు ఈ పాటకు గాను రెమ్యునరేషన్ ఎంత ఇచ్చి ఉంటారు అనేదాని మీద ఆసక్తి రేగడం సహజం.

ఫిలిం నగర్ టాక్ ప్రకారం సుమారు 2 కోట్ల రూపాయలు జాక్వలిన్ కు కేవలం ఈ ఒక్క పాటకు డాన్స్ చేసేందుకు ఇచ్చారట. సమయం ఎక్కువగా లేకపోవడం తనకన్నా బెటర్ ఛాయస్ అనిపించే హీరోయిన్ ఎవరు స్పెషల్ సాంగ్ చేయడానికి దొరక్కపోవడం లాంటి కారణాల వల్ల జాక్వలిన్ అడిగినంత ఇవ్వక తప్పలేదని వినికిడి. ఏదైతేనేం ఎందులోనూ కాంప్రోమైజ్ కానీ సాహో ఆఖరికి పాట విషయంలో రాజీపడని ధోరణి చూపడం మెచ్చుకోదగినదే. మనకు చూపించకుండా దాచి మిగిలిన బాలన్స్ పాటలో ఇంకెంత రొమాన్స్ ఉందో తెలియాలంటే 30 దాకా వేచి చూడాల్సిందే.
Please Read Disclaimer