షాకింగ్ రోల్ లో జగ్గూ భాయ్?

0

లెజెండ్ తో విలన్ గా ఏ ముహూర్తంలో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాడో కానీ అప్పటి నుంచి జగపతిబాబుకు తిరుగు లేకుండా పోయింది. ఇప్పుడు టాలీవుడ్ లో హయ్యెస్ట్ పెయిడ్ విలన్ ఎవరయ్యా అంటే మరో పేరు వినిపించడం లేదు. అందులోనూ ఎంత రెమ్యునరేషన్ ఇచ్చినా సరే జగ్గు భాయ్ డేట్స్ దొరకడం కూడా అంత ఈజీగా లేదు. తాజా అప్ డేట్ ప్రకారం ఇంత టైట్ షెడ్యూల్ లోనూ జగపతిబాబు ఓ వెబ్ సిరీస్ చేయడానికి ఒప్పుకున్నట్టు టాక్.

గతంలోనూ అమెజాన్ ప్రైమ్ నిర్మించిన గ్యాంగ్ స్టార్స్ లో నటించిన జగ్గు అందులో బాగానే రెస్పాన్స్ దక్కించుకున్నాడు. ఇప్పుడిది రెండోది. ట్విస్ట్ ఏంటంటే ఇందులో జగపతి బాబు పోషించే పాత్ర లాయర్ అట. అందులోనూ అమ్మాయిలను మహిళలను విపరీతమైన కామదృష్టితో చూసే పేరు మోసిన న్యాయవాదిగా చాలా డిఫరెంట్ గా ఈ రోల్ ఉంటుందట

దీనికి దర్శకుడు ఎవరనుకున్నారు. మెహెర్ రమేష్ అని సమాచారం. ప్రభాస్ బిల్లా – జూనియర్ ఎన్టీఆర్ శక్తి కంత్రి – వెంకటేష్ షాడోలతో భారీ డైరెక్టర్ గా పేరున్న రమేష్ వాటి బడ్జెట్ స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయాడు. అందుకే కొంత కాలం మహేష్ టీమ్ లో ఉంటూ దర్శకత్వానికి దూరంగా ఉన్నాడు.

ఇప్పుడీ వెబ్ సిరీస్ ద్వారా రీ ఎంట్రీ ఇవ్వాలనే ప్లాన్ లో ఉన్నాడట. ఇది ఇంకా అధికారికంగా కన్ఫర్మ్ కావాల్సి ఉంది. మిగిలిన నటీనటులు టెక్నీకల్ టీమ్ వివరాలు తెలియాల్సి ఉంది. ఒకపక్క సమంతా లాంటి టాప్ హీరోయిన్స్ ఇటు పక్క జగపతిబాబు లాంటి టాలెంటెడ్ ఆర్టిస్టులు అందరూ ఇలా వెబ్ సిరీస్ వైపు మొగ్గు చూపడం చూస్తే హిందీ తరహాలో తెలుగులోనూ వీటికి మంచి మార్కెట్ వచ్చేలా ఉంది
Please Read Disclaimer