జగ్గూభాయ్ పాత్ర ఎందుకు ఇంత హైలైట్!!

0

ఫ్యామిలీ హీరోగా ఒకప్పుడు స్టార్ హీరోల సరసన నిలిచిన జగపతిబాబు ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా స్టార్ డంను దక్కించుకున్నాడు. ‘లెజెండ్’ చిత్రంతో సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలు పెట్టిన జగపతిబాబు కెరీర్ లో ది బెస్ట్ పాత్ర ‘అరవింద సమేత’లో చేశాడు. ఇందులో బసి రెడ్డిగా జగపతిబాబు నటన అద్బుతం. కరుడు గట్టిన ఫ్యాక్షనిస్ట్ పాత్రలో జగపతిబాబు నటించాడు.

అరవింద సమేత చిత్రం ప్రీ రిలీజ్ వేడుక సమయంలో ఎన్టీఆర్ అన్నట్లుగా ఈ పాత్ర జగపతిబాబుకు కెరీర్ బెస్ట్ అంటూ సినీ విశ్లేషకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పాత్రకు తగ్గట్లుగా బాడీలాంగ్వేజ్ గెటప్ ఇంకా డైలాగ్ డెలవరీతో జగపతిబాబు బసి రెడ్డి పాత్రకు జీవం పోశాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ‘లెజెండ్’ తర్వాత ఆ స్థాయి పాత్రను జగపతిబాబు పోషించాడు. ఎన్టీఆర్ తర్వాత ‘అరవింద సమేత’ చిత్రంలో అత్యధికంగా ప్రేక్షకులను అలరించిన జగపతిబాబు ముందు ముందు మరిన్ని అవకాశాలను దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.

గతంలో ఎన్టీఆర్ తో ‘టెంపర్’ చిత్రంలో నటించే అవకాశం వస్తే నో చెప్పిన జగపతిబాబు ఇప్పుడు ‘అరవింద సమేత’ చిత్రంతో ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఎన్టీఆర్ ‘నాన్నకు ప్రేమతో’ చిత్రంలో కూడా జగపతిబాబు నటించాడు. కాని ఆ చిత్రంలో జగపతిబాబు పాత్రకు ఇంతగా గుర్తింపు రాలేదు. మొత్తానికి జగ్గూబాయ్ రెండవ ఇన్నింగ్స్ లో అద్బుతమైన పాత్రలను దక్కించుకుంటూ మరోసారి ప్రేక్షకులను అలరిస్తూ ఉన్నాడు.
Please Read Disclaimer