ఆల్ కైండ్ ఆఫ్ గిగా స్టార్స్.. పంచ్ ఏసేశారే

0

ఆదివారం సాయంత్రం `సైరా` ప్రీరిలీజ్ ఈవెంట్ కి భారీగా అతిధులు.. వేలాది అభిమానులు విచ్చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇంత పెద్ద వేదికపై సీనియర్ నటుడు జగపతిబాబు అలియాస్ జగ్గూ భాయ్ వేసిన పంచ్ హైలైట్ గా నిలిచింది. ఆయన మెగా హీరోల్ని కావాలని అనకపోయినా.. ఆ ఫ్లోలో అది అలా వచ్చేసింది. ఇంతకీ ఆయన ఏమన్నారు అంటే..?

మెగాస్టార్.. పవర్ స్టార్.. ఆల్ కైండ్ ఆఫ్ గిగా స్టార్స్ ఆన్ ది స్టేజ్..! ఇంతమంది ఉన్న వేదికపై నేను ఎక్కువ మాట్లాడను అంటూ షార్ట్ అండ్ స్వీట్ గా స్పీచ్ ముగించేశారు జగపతి. ఓవైపు తరుముకొస్తున్న వరుణుడిని ఎగా దిగా చూస్తూ జగపతిలానే ఇతరులంతా స్పీచ్ లు ముగించారు. ఆ కంగారుతో కూడుకున్న ఫ్లోలో జగపతి నోట ఈ సెటైర్ పడిపోయిందన్నమాట.

అయితే దీనికి మీనింగేమిటి? అన్నది విశ్లేషిస్తే .. ఈరోజుల్లో హీరోలకు ఫ్యాన్స్ ఏదో ఒక తోక తగిలించేస్తున్నారని.. ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ ఇందులో స్పీడ్ గా ఉంటారని కావొచ్చు. మెగాస్టార్.. పవర్ స్టార్.. సుప్రీంహీరో.. మెగా ప్రిన్స్.. స్టైలిష్ స్టార్.. ఇవన్నీ అభిమానులకు చాలా ఇష్టమైనవి. తమ అభిమాన కథానాయకుడిని అలా పిలిచేందుకే ఇష్టపడతారు కూడా. అయితే మెగా హీరోలు కూడా తమని గుండెల్లో పెట్టుకునే అభిమానుల్ని ఎప్పుడూ అస్సలు విస్మరించరు. ఈ వేదికపై చిరంజీవి.. పవన్ కల్యాణ్ మరోసారి తమ్ముళ్లూ! అంటూ ఫ్యాన్స్ పై ఎంతో ప్రేమాప్యాయతల్ని కురిపించారు. పవన్ అయితే నేనూ మీలో ఒకడిని అన్నయ్య మ్యాటర్ కి వస్తే! అంటూ ఎమోషన్ అయ్యారు.
Please Read Disclaimer