జగ్గూ భాయ్ కొత్త జర్నీ

0

ఫ్యామిలీ హీరోగా 1990లలో ఎన్నో చిత్రాలతో మెప్పించిన జగపతిబాబు కాలక్రమేనా క్యారెక్టర్ ఆర్టిస్టుగా.. విలన్ గా మారిపోయాడు. ప్రస్తుతం టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో కూడా వరుసగా చిత్రాలు చేస్తున్న జగ్గూ భాయ్ త్వరలోనే కొత్త రోల్ లో కనిపించబోతున్నాడు. న్యూ ఇన్నింగ్స్ లో చాలా జోరు మీదున్న జగపతి బాబు అదే జోష్ తో బుల్లి తెరపై కనిపించేందుకు సిద్దం అవుతున్నట్లుగా సమాచారం అందుతోంది. గతంలోనే జగపతిబాబు బుల్లి తెరపై కనిపించాడు.

ప్రస్తుతం జగపతిబాబు క్రేజ్.. ఇమేజ్ వేరు. ఇలాంటి సమయం లో ఈయన బుల్లి తెరపై కొత్త జర్నీకి శ్రీకారం చుట్టబోతున్నాడు. ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్ డిజైన్ చేసిన ఒక టాక్ షోను జగ్గూభాయ్ హోస్ట్ చేయబోతున్నాడు. ఆ షోకు సంబంధించి ఇంకా ఎలాంటి అధికారిక క్లారిటీ అయితే రాలేదు. కాని ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఇది ఒక టాక్ షో అని.. ఇప్పటి వరకు వచ్చిన టాక్ షోలకు.. ప్రస్తుతం వస్తున్న టాక్ షోలకు ఇది చాలా విభిన్నంగా ఉంటుందని అంటున్నారు.

సెకండ్ ఇన్నింగ్స్ లో సూపర్ హిట్ అయిన జగపతి బాబు మరో వైపు వెబ్ సిరీస్ ల్లో కూడా నటించేందుకు ఆసక్తి చూపుతున్నాడు. ఎక్కడ చిన్న ఛాన్స్ ఉన్నా కూడా వదులుకోకుండా అన్నింట్లో కూడా తన సత్తా చాటేందుకు జగ్గూ భాయ్ ప్రయత్నం చేస్తున్నాడు. మరి బుల్లి తెర పై ఆయన ప్రస్థానం ఎలా సాగబోతుందనేది చూడాలి.
Please Read Disclaimer