కండోమ్స్ కంపెనీ ఓనర్ గా జగ్గు భాయ్

0

జగపతి బాబు అలియాస్ జగ్గుబాయ్ సెకెండ్ ఇన్నింగ్స్ ఓ వెలుగు వెలుగుతున్న సంగతి తెలిసిందే. స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు అందుకుంటున్నాడు. నిరంతరం ప్రతి నాయకుడి గా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఫుల్ బిజీగానే ఉన్నాడు. టాలీవుడ్ స్టార్ హీరోలకు తెలుగు విలన్లు లేరు అన్న కొరతను కొంత వరకూ తీర్చగలిగాడు. అలాగని హీరో వేషాలు వదిలేయడం లేదు. అవకాశం వస్తే వాటికి సై అంటూ సంతకం చేస్తున్నాడు. తాజాగా ఓ బోల్డ్ మూవీలో మెయిన్ లీడ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

డాన్స్ మాస్టర్ విద్యాసాగర్ జగపతి బాబుతో ఓ బోల్డ్ మూవీని తెరకెక్కించబోతున్నాడు. ఇందులో జగపతి బాబు కండోమ్ లు తయారు చేసే కంపెనీ అధిపతి గా కనిపించనున్నాడుట. వేశ్యల తో మాత్రమే తన కంపెనీ కి సంబంధించిన ప్రకటనలు రూపొందిస్తాడుట. ఆ క్రమంలోనే అతడు ఓ వేశ్య తో ప్రేమ లో పడతాడుట. అటుపై ఆ ప్రయాణం ఎలా సాగిందన్నదే సినిమా. ఇందులో వేశ్య పాత్ర లో బోల్డ్ బ్యూటీ శ్రద్దా దాస్ నటించనుంది. జగ్గు భాయ్ ప్రేమలో పడేది ఈ భామతోనే. ఈ ప్రేమ కథ చాలా ఎమోషనల్ గా సాగుతుందిట.

ఇక జగపతి బాబు కు ఇది ఛాలెంజింగ్ రోల్ అనే చెప్పాలి. ఫ్యామిలీ హీరోగా తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. విలన్ గాను ఐడెంటీని చాటుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఇలాంటి సమయంలో వేశ్యతో ప్రేమలో పడే కండోమ్ కంపెనీ అధిపతి రోల్ అంటే కచ్చితం గా సాహసమనే అంటున్నారు. గతంలో ఇలాంటి సాహసమే సీనియర్ నరేష్ ఓసారి చేసాడు. నిత్యామీనన్ ప్రధాన పాత్ర పోషించిన ఘటన అనే సినిమాలో ఉమనైజర్ పాత్రలో నటించాడు. ఎప్పుడూ పాజటివ్ గా.. స్టాప్ పాత్రల్లో కనిపించే సరేష్ తొలిసారి తెరపై నెగిటివ్ షేడ్ ని టచ్ చేయడంతో ప్రశంసలతో పాటు విమర్శలొచ్చాయి. ఇప్పుడు జగ్గూభాయ్ అలాంటి ప్రయోగాలే చేస్తున్నాడు.
Please Read Disclaimer