బిగుతైన మినీ డ్రెస్..జాన్వి బ్యూటీ అన్ లిమిటెడ్!

0

అతిలోకసుందరి శ్రీదేవికి వారసురాలిగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది జాన్వి కపూర్. మొదటి సినిమా ‘ధడక్’ తోనే డీసెంట్ మార్కులు తెచ్చుకున్న జాన్వి ప్రస్తుతం రెండు మూడు ప్రాజెక్టులను లైన్లో పెట్టింది. జాన్వి ఫిట్నెస్ ఫ్రీక్ కావడంతో ప్రతి రోజు వ్యాయామశాలకు వెళ్ళి కసరత్తులు చేస్తుంది. పనిలో పనిగా తన జిమ్ము డ్రెస్సులను ప్రత్యేకంగా డిజైన్ చేయించుకుంటుంది కాబట్టి జాన్వి జిమ్ డ్రెస్ లకు భారీ ఫాలోయింగ్ ఏర్పడింది. మినీలు.. మైక్రోలు ఎడాపెడా ధరించి గ్లామరసం చిందిస్తూ కెమెరాలకు హాయ్ లు చెప్తూ.. బైబైలు చెప్తూ సూపర్ పోజులు ఇస్తుంది.

ఇదంతా ఒక ఎత్తైతే రీసెంట్ గా జాన్వికి కజిన్ అయిన సోనమ్ కపూర్ జన్మదిన వేడుకలు జరిగాయి. దీంతో కపూర్ ఖాన్ దాన్ కు సంబంధించిన ముఖ్యమైన సభ్యులందరూ హాజరయ్యారు. అక్కడ ఎంతమంది ఉన్నా అందరి దృష్టి మాత్రం శ్రీదేవి 2.0 మీదేనట. ఎంతో సింపుల్ గా జాన్వి ఒక వైట్ మినీ డ్రెస్ ధరించి ఆ బర్త్ డే పార్టీకి హాజరయింది. ఈ డ్రెస్ కు మ్యాచింగ్ అన్నట్టుగా జుట్టును ఫ్రీగా వదిలేసింది. సూటబుల్ మేకప్ తో న్యూ జెనరేషన్ బ్యూటీలాగే కనిపించింది. ఇక చానెల్ బ్రాండ్ వారి బ్యాగ్ కూడా తన స్టైలింగ్ కు పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయింది. అయితే అన్నిటికంటే హైలైట్ మాత్రం జాన్వి ఒంటిని ఎంతో జాగ్రత్తగా అంటిపెట్టుకున్న బిగుతైన వైట్ డ్రెస్సే. అసలే జూనియర్ శ్రీదేవి. ఇంత హాట్ గా.. స్టైలిష్ గా కనిపిస్తే ఇంకా ఈ ఫోటోలు వైరల్ కాకుండా ఉంటాయా?

జాన్వి ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే ఎయిర్ ఫోర్స్ పైలట్ గుంజన్ సక్సేనా బయోపిక్ ‘కార్గిల్ గర్ల్’ చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా కాకుండా కరణ్ జోహార్ ‘తఖ్త్’ లో కూడా హీరోయిన్ గా నటిస్తోంది.