జలేబి భామ గులాబ్ జామ్ పోజు

0

‘తూనీగా తూనీగా’ సినిమా చూసిన వారికి రియా చక్రబర్తి పేరు తెలిసే ఉంటుంది. ఆ సినిమా చూడకపోతే మాత్రం పరిచయం ఉండే అవకాశం తక్కువే. అయితే హిందీలో మాత్రం ఓ అరడజను సినిమాల్లో నటించింది. ‘జలేబి’ అనే హిందీ సినిమా జిమ్నాస్టిక్ కిస్సు పోస్టర్ లో ఉండేది ఈ హాటు బ్యూటీనే. ఈ భామ నిన్న ఫెమినా బ్యూటీ అవార్డ్స్ కార్యక్రమానికి హాజరైంది.

ఏ సందర్భం లేకపోతేనే కత్తిలా రెడీ అయ్యే ఈ భామ బ్యూటీ అవార్డ్స్ ఈవెంటుకు అట్టట్ట రెడీ అయి ఎట్టా వస్తుంది చెప్పండి? అందుకే చూసివారికి కనీసం టెంపరేచర్ రెండు డిగ్రీల ఫారెన్ హీట్ పెరిగి ఓ డోలో లేదా పారాసెటమాల్ తగిలిస్తే తప్ప తగ్గని గ్లామర్ జ్వరాన్ని తీసుకొచ్చేలా అందాలను వడ్డించింది. స్లీవ్ లెస్.. థై స్లిట్ డిజైన్ ఉన్న డ్రెస్ లో ఓ అందాల దేవతలా కనిపించింది. అయినా ఇంత ఫిట్టుగా గ్లామర్ తో ఉండాలంటే రోజూ ఎన్ని కసరత్తులు చేస్తోందో.. ఎలాంటి డైట్ లో ఉందో. ఆ సీక్రెట్ ఏదో చెప్తే అందరూ అదే ఫాలో అయ్యి అందంగా మారిపోతారు కదా!

ఏదేమైనా తనదైన శైలిలో ఈ భామ ఫెమినా బ్యూటీ అవార్డ్స్ ఈవెంట్ లో అందంగా కనిపించి అందరినీ ఆకర్షించింది. ఇంతకీ ఈ డ్రెస్ కు తన ఇన్స్టాలో రియా ఇచ్చిన క్యాప్షన్ ఏంటి తెలుసా?.. “మెరిసేది కూడా ఒక్కోసారి బంగారమే”. హాటీ చెప్పే ఈ మాటతో విరోధించే జఫ్ఫా ఎవరూ ఉండరు. ఇక సినిమాల విషయానికి వస్తే ఈ భామ ప్రస్తుతం ‘చెహ్రే’ అనే బాలీవుడ్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-