#జేమ్స్ బాండ్ 25: టైటిల్ వచ్చేసిందోచ్

0

ప్రపంచ వ్యాప్తంగా విజయవంతమైన మూవీ సీరీస్ ఎన్నో ఉన్నాయి కానీ వాటిలో ప్రముఖమైనది జేమ్స్ బాండ్ సీరీస్. బాండ్ కొత్త సినిమా వస్తుందంటే చాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియుల్లో సంతోషం వ్యక్తం అవుతుంది. భారీ బడ్జెట్లు.. స్టైల్.. హై ఎండ్ యాక్షన్ సీక్వెన్సులు.. హాట్ రొమాన్స్.. అబ్బో ఒక్కటేమిటి.. అన్ని స్పెషల్సే. బ్రాండింగ్.. కొత్త గాడ్జెట్లు కూడా అభిమానుల్లో ఎంతో ఆసక్తిని రేపుతాయి. ఇప్పుడు ఇంత ఇంట్రో ఎందుకంటే బాండ్ సీరీస్ లో తెరకెక్కుతున్న 25 వ చిత్రానికి టైటిల్ ను ప్రకటించారు నిర్మాతలు.

‘నో టైమ్ టు డై’ అనేది ఈ చిత్రం టైటిల్. దీన్ని ఇంగ్లీష్ సినిమాల నాటు డబ్బింగ్ డైలాగ్స్ తరహాలో “చావడానికి సమయం లేదు” అని అనువాదం చేసి మనోవేదనకు గురి కాకండి. కొన్నిటిని శుద్ధమైన ఆంగ్లమున చదివితేనే అందము! ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ లో విడుదల చేస్తున్నామని కూడా నిర్మాతలు ప్రకటించారు. ఈ సినిమాలో బాండ్ పాత్రలో డేనియల్ క్రెయిగ్ నటిస్తున్నాడు. జేమ్స్ బాండ్ పాత్రలో నటించడం డేనియల్ కు ఇది ఐదవసారి. బ్రిటిష్ స్పై ఏజెంట్ 007 గా ఈ చిత్రంలో చివరిసారిగా నటిస్తున్నాడట.

ఓ మిస్సింగ్ సైంటిస్ట్ ఆచూకి కనుక్కోవడం కోసం బాండ్ తన ప్రయాణాన్ని ప్రారంభిస్తాడని.. ఆ ప్రయాణంలో తనకు అనుకోని సంఘటనలు.. భయకరమైన విలన్ లు తారసపడతారట. మరి బాండ్ వారిని ఏ రకంగా ఎదుర్కొన్నాడు.. సైంటిస్ట్ కు ఏం జరిగింది అనేది మిగతా ఈ సినిమా మూల కథ. ఈ చిత్రంలో రమి మలెక్ విలన్ గా నటిస్తున్నారు. రాల్ఫ్ ఫినేస్.. నవోమీ హ్యారిస్.. జెఫ్రీ రైట్.. డేవిడ్ డెన్ కిక్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. డ్యాన్ రోమార్ సంగీత దర్శకుడు. ఈ చిత్రానికి దర్శకుడు కేరీ ఫకునగ. ఈ చిత్రానికి నిర్మాతలు మైఖేల్ విల్సన్.. బార్బరా బ్రోకొలి.
Please Read Disclaimer