స్టార్ డాటర్ కి చెమటలు పట్టించిన దెయ్యం

0

అతిలోక సుందరి శ్రీదేవి గారాల పట్టి జాన్వీకపూర్ కెరీర్ స్పీడ్ గురించి తెలిసిందే. ఓవైపు కెరీర్ పరంగా బిజీ. మరోవైపు ఇన్ స్టాలో రెగ్యులర్ ఫోటోషూట్లతో అల్లాడించేస్తోంది. మామ్ కి మించిన ట్రెండీ స్టార్ గా హాటీ గా సోషల్ మీడియాలో పాపులర్ అవుతోంది. మరాఠీ బ్లాక్ బస్టర్ సైరాఠ్ ఆధారంగా కరణ్జోహర్ నిర్మించిన `ధడక్` సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన జాన్వీ తొలి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసింది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా వుంది. ఓ పక్క సినిమాల్లో నటిస్తూనే నెట్ ఫ్లిక్స్ కోసం `ఘోస్ట్ స్టోరీస్` వెబ్ సిరీస్ లో నటిస్తోంది.

జనవరి 1 నుంచి ప్రసారం మొదలైన ఈ వెబ్ సిరీస్ మొత్తం నాలుగు భాగాలుగా రాబోతోంది. ఇందులో మొదటి భాగాన్ని కరణ్ జోహర్ రూపొందించగా.. రెండవ భాగాన్ని దిబాకర్ బెనర్జీ .. మూడవ భాగాన్ని జోయాఅక్తర్.. నాలుగవ భాగాన్ని అనురాగ్ కశ్యప్ రూపొందించారు. జోయా అక్తర్ రూపొందించిన సిరీస్ లో జాన్వి నర్స్ గా నటించింది.

అయితే ఈ సిరీస్ లో నటించడం ఆనందాన్ని కలిగించిన మాట నిజమే కానీ.. అంతకుమించి హారర్ టెర్రర్ చెమటలు పట్టించిందని జాన్వీ తెలిపింది. నర్స్ పాత్రకు షూటింగ్ చేస్తున్న సమయంలో ఆ టైట్ డ్రెస్ కారణంగా ఇబ్బంది కలిగిందని.. తనకు చెమటలు పట్టేశాయని చెప్పుకొచ్చింది. ఘోస్ట్ స్టోరీస్ సీజన్ వన్ రిపోర్ట్ ఈ వారంలోనే తేలనుంది. ఇక ఇందులో దెయ్యాల గడబిడ ఎలా ఉందో.. జాన్వీ నటన ఆకట్టుకుందో లేదో వీక్షకులే చెప్పాల్సి ఉంది.
Please Read Disclaimer