ఆ డ్రెస్ జాన్వీకి చాలా చిరాకేసిందట!

0

అతిలోక సుందరి కుమార్తె అంటే మాటలా? మొదట్నించి శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ మీద అంచనాలు భారీగానే ఉండేవి. తన తొలి చిత్రం ధడక్ తో అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా అందరి చేత ప్రశంసలు అందుకుంది జాన్వీ. ప్రస్తుతం చేతి నిండా సినిమాలు చేస్తున్న ఆమె.. అనూహ్యంగా వెబ్ సిరీస్ చేయాలని నిర్ణయించుకోవటం.. ఈ ఏడాది తొలి రోజున విడుదల కావటం తెలిసిందే.

ఓపక్క సినిమాలతో బిజీగా ఉంటూ.. మరోవైపు వెబ్ సిరీస్ చేయటం చూస్తే.. కెరీర్ విషయంలో జాన్వీకి ఎంత క్లారిటీ ఉందన్న విషయం ఇట్టే అర్థం కాక మానదు. జోయా అక్తర్ తెరకెక్కించిన ఘోస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్ లో నర్సుగా కనిపించింది. ఆ పాత్రను చేయటంపై ఆనందాన్ని వ్యక్తం చేసిన జాన్వీ.. నర్సు క్యాస్టూమ్ ధరించటం మాత్రం చిరాగ్గా ఉందని చెప్పింది.

నర్స్ పాత్ర పోషించటం చాలా తేలికే అయినప్పటికీ.. ఆ డ్రెస్.. క్యాస్టూమ్ కారణంగా చెమటలు పట్టేవి. సెట్ లో చాలా చిరాగ్గా అనిపించేదని చెప్పుకొచ్చింది. నర్సు పాత్రలో తనను తాను చూసుకోవటం చాలా సంతోషమేసిందని.. తన పాత్ర చక్కగా రావటం కోసం ఒక రియల్ నర్సు తనకెంతో సాయం చేసినట్లుగా జాన్వీ వెల్లడించింది.
Please Read Disclaimer