వీడియో: జాన్వీతో షేరింగ్ కోసం క్లాస్ మేట్ పాట్లు!

0

ఒకే కోకాకోలాలో రెండు స్ట్రాలు వేసుకుని కార్నర్ సీట్లో కూచుని సిప్ చేసేవాళ్లను లవర్స్ అంటాం. మరి వీళ్లను ఏమనాలి? ఒకే బెంచీపై పక్క పక్కనే కూచున్నారు. చెరో కొబ్బరి బొండాం చేతిలో ఉన్నా.. అతడి చూపులన్నీ జాన్వీ బొండాంపైనే ఉన్నాయి. అందులో స్ట్రా వేయాలని తనతో పాటే షేర్ చేసుకోవాలని ఆత్రం కనిపించింది. మొత్తానికి ఆ కుర్రాడెవరో కానీ మహా చిలిపి చిపక్ గ్గుల్ గయ్.. జాన్వీతో మరీ అంత డీప్ గా వెళ్లిపోయాడు. అసలే స్కూల్ ఏజ్.. ఇద్దరూ వైట్ అండ్ వైట్ యూనిఫామ్ లో ఉన్నారు. ఏదో స్కూల్లో సీన్ అది అని అర్థమైపోతోంది.

అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ తక్కువ కాలంలోనే స్టార్ స్టాటస్ ని దక్కించుకుని బాలీవుడ్ లో వెలిగిపోతోంది. వరుసగా సినిమాల్లో నటిస్తూ కెరీర్ ని పరుగులు పెట్టిస్తోంది. మరోవైపు సోషల్ మీడియాల్లో వ్యక్తిగత సమాచారాన్ని రకరకాల వీడియోలు ఫోటోల రూపంలో షేర్ చేసి పాపులర్ అవుతోంది. నిత్యం ఫిట్ నెస్ ని కాపాడుకోవడం కోసం జిమ్ములో వర్కౌట్లు…యోగా సెంటర్లలో ఆసనాలు ప్రాక్టీస్ చేస్తూ.. హాట్ హాట్ వీడియోలను సోషల్ మీడియాలోకి రిలీజ్ చేస్తోంది. ప్రస్తుత తరం యువనాయికలందరికి జాన్వీ ఠఫ్ కాంపిటీటర్.

ఇటీవల సోషల్ మీడియా ఫాలోవర్స్ ని పెంచుకునేందుకు జాన్వీ రకరకాల టెక్నిక్స్ ప్లే చేస్తోంది. తాజాగా జాన్వీ స్కూల్ డేస్ కే వెళ్లిపోయి ప్రచారం మొదలు పెట్టింది. జాన్వీ స్కూలింగ్ డేస్ లో తన స్నేహితుడితో కలిసి కొబ్బరి బోండాం తాగుతోన్న ఓ వీడియోను పోస్ట్ చేసింది.స్నేహితుడితో కలిసి ఏదో పోటీ పెట్టుకున్నట్టు ఉంది. పక పకా నవ్వుతూ కొబ్బరి నీళ్లును సేవిస్తోంది. మధ్యలో జాన్వీ స్నేహితుడు తన బోండాంలో స్ట్రాను జాన్వీ చేతిలోని బోండాంలో వేసే ప్రయత్నం చేస్తుంటే అడ్డుకుంది. యూనిఫాంలో ఉన్న ఈ యువజంట అప్పుడు ఏ క్లాస్ లో ఉన్నారు? అన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతోంది. అది చూసిన నేటి జనులు జాన్వీ ఫన్నీ మూవ్ మెంట్స్ పై కామెంట్లు పెడుతున్నారు. ఆ వీడియోలో జాన్వీ ముక్కు మాత్రం దొడ్డుగా.. పెద్దదిగా కనిపిస్తోందంటూ కామెంట్లు చేస్తున్నారు.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-