అందరూ వచ్చి ఆమెతో ఆ మాటలే మాట్లాడుతున్నారట

0

అతిలోక సుందరి దివంగత శ్రీదేవి పెద్దమ్మాయి జాన్వీ కపూర్. తొలి నుంచి శ్రీదేవి నట వారసురాలిగా ఇమేజ్ ఉంది. దీనికి తగ్గట్లే.. తన తొలి సినిమా ధడక్ తో తానేమిటో ఫ్రూవ్ చేసుకోవటమే కాదు.. తన అందానికి యూత్ ఫిదా అయ్యేలా చేసింది. స్టైలీష్ క్వీన్ గా అభివర్ణించే ఆమెకు పెద్ద కష్టమే వచ్చి పడిందట.

ప్రస్తుతం ఒక బయోపిక్ లో చేస్తున్న ఆమె వద్దకు వచ్చిన అభిమానులంతా ఆమెతో సినిమా గురించి కాకుండా.. ఇతర విషయాలు మాట్లాడటం ఇబ్బందిగా మారిందట. తొలి సినిమా విడుదలకు ముందు.. తర్వాత ధడక్ గురించి మాట్లాడేవారని.. ఇప్పుడేమో తాను జిమ్ కు వెళ్లేటప్పుడు వేసుకునే దుస్తుల గురించి మాట్లాడుతున్నారని చెప్పుకొచ్చింది.

మేడమ్.. మీ జిమ్ దుస్తులు భలేగా ఉన్నాయంటే చెబుతున్నారని.. వారు అలా చెబుతుంటే తనకుచాలా ఇబ్బందిగా ఉందని వాపోతోంది. తన జిమ్ దుస్తుల గురించి పొగుడుతున్న వారిని తాను తప్పు పట్టటం లేదని.. ఎవరైనా అందం.. దుస్తుల మీదనే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంటారని చెప్పింది.

తాను వేసుకునే పొట్టి దుస్తుల గురించి మాట్లాడటం తనకు బాగోవటం లేదని.. తన సినిమా గురించి మాట్లాడితే బాగుంటుందని చెప్పుకొచ్చింది. సినిమాల గురించి మాట్లాడాలంటే వరుసగా వస్తుంటే.. అందరూ దాని గురించే మాట్లాడతారు. అలా కాకుండా ఒక సినిమా కు మరో సినిమాకు గ్యాప్ ఇంతలా వస్తే.. ఇతర అంశాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారన్నది జాన్వీకి ఎప్పుడు తెలుస్తుంది?
Please Read Disclaimer