రౌడీకి ఊహించని షాకిచ్చిందే

0

రౌడీస్టార్ విజయ్ దేవరకొండ కథానాయకుడిగా డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఫైటర్ తెరక్కించడానికి సర్వం సిద్దం చేస్తున్నాడు. స్రిప్ట్ పనులు పూర్తయిన నేపథ్యంలో పూరి-చార్మి ముంబైలో మకాం వేసి నటీనటులను ఎంపిక చేసే పనిలో పడ్డారు. గత నెల రోజులుగా ముంబైలో ఉంటున్నారు. రౌడీ స్టార్ పై రింగ్ లో సిసలైన పంచ్ లు తినిపించడానికి రియల్ బాక్సర్ మైక్ టైసన్ నే దించే ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం సాగింది. ఇక విజయ్ తో రొమాన్స్ చేయడానికి అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ కపూర్ ని ఎంపిక చేసారు. ముంబైలో అమ్మడికి పూరి కథ వినిపించారు. ఆ తర్వాత కథ.. తన పాత్ర నచ్చడంతో…. రౌడీ సరసన నటించేందుకు జాన్వీ ఫైనల్ అయ్యిందట. ఇప్పటికీ జాన్వీనే ఫైనల్ అని భావిస్తున్నారంతా. కానీ ఇంతలోనే ఊహించని ట్విస్టు.

దీంతో సోషల్ మీడియా సహా అన్ని ప్రముఖ మీడియాల్లోనూ రౌడీ స్టార్ కి హీరోయిన్ దొరికేసిందంటూ జాన్వీ పేరు ప్రచారంతో వేడెక్కించింది. అయితే తాజాగా జాన్వీ సంచలన నిర్ణయం తీసుకుందిట. ఈ ప్రాజెక్ట్ నుంచి ఎగ్జిట్ అయ్యిందని … జాన్వీ బాలీవుడ్ లో కమిట్ అయిన చిత్రాల కారణంగా కాల్షీట్లు సర్దుబాటు చేయడం కుదరక తానే తప్పుకుందని అక్కడ మీడియా లో కథనాలొస్తున్నాయి. మరి ఇందులో వాస్తవం ఎంత? అన్నది అధికారికంగా తెలియాల్సి ఉంది.

దీంతో జాన్వీ డ్రీమ్ తాత్కలికంగా నెరవేరనట్టేనా? రౌడీస్టార్ తో రొమాన్స్ చేయాలని అర్జున్ రెడ్డి సినిమా చూసినప్పటి నుంచి తెగ ఆరాటపడుతోంది. విజయ్ అంటే క్రష్ అని కూడా అంది. కానీ అవకాశం వచ్చినా ఇలా చేజార్చుకోవాల్సి వచ్చింది. దీంతో పూరి మరో హీరోయిన్ ని వెతుక్కోక తప్పదని సీన్ చెబుతోంది. ఇక ఇదే నెలలో ఫైటర్ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాలని పూరి టీమ్ సన్నాహాకాలు చేస్తోంది. ఇంతలోనే జాన్వీ ట్విస్ట్ విజయ్ తో సహా పూరి కి ఓ షాకింగ్ లా ఉంటుందేమో.
Please Read Disclaimer