ఆ స్టైల్.. యాటిట్యూడ్ సూపర్!

0

అతిలోకసుందరి శ్రీదేవి వారసురాలిగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది జాన్వి కపూర్. శ్రీదేవి కూతురు కావడంతో మిగతా స్టార్ కిడ్స్ కంటే జాన్వికి క్రేజ్ కాస్త ఎక్కువే. మొదటి సినిమా ‘ధడక్’ తో సూపర్ అని కాకపోయినా మంచి మార్కులే తెచ్చుకుంది. ఇప్పుడు చేతిలో రెండు మూడు సినిమాలు ఉన్నాయి. ఇక జాన్వి ఈతరం స్టార్ కిడ్ కావడంతో ఫ్యాషన్ సెన్స్ ఎక్కువే. సందర్భానికి తగ్గట్టు దుస్తులు ధరించడం.. చూపరుల మతులు పోగొట్టడం చాలా సాధారణం.

జాన్వికి సోనమ్ కపూర్ కజిన్ అనే సంగతి తెలుసు కదా. నిన్న సోనమ్ కపూర్ భర్త ఆనంద్ ఆహూజా ఒక పార్టీ ఇచ్చారట. దీంతో కపూర్ ఖాన్ దాన్ తో పాటుగా యంగ్ జెనరేషన్ యాక్టర్లు అందరూ ఆ పార్టీలో పాల్గొని సందడిని తీసుకొచ్చారు. ఇలాంటి సందర్భానికి జాన్వి సాధారణమైన డ్రెస్ వేసుకోదు కదా? రెడ్ హాట్ గా కనిపించే రెడ్ కలర్ డ్రెస్ ధరించింది. తెలుగు రంగు బూట్లు ధరించింది. కోటు లాగా కనిపించే గౌన్ తో అందరి చూపును తనవైపుకు తిప్పుకుంది. అందాల విందులు గట్రా లేవు కానీ ఆ స్టైల్.. ఆ యాటిట్యూడ్ తో అందరిని మెస్మరైజ్ చేసింది.

అసలే జాన్వి సోషల్ మీడియాలో హాట్ ఫేవరెట్. అందుకే ఫోటోగ్రాఫర్లు జాన్విని తమ కెమెరాల్లో బంధించారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక జాన్వి సినిమాల విషయానికి వస్తే ‘గుంజన్ సక్సేనా’.. ‘రూహ్ అఫ్జా’.. ‘దోస్తానా 2’ చిత్రాల్లో నటిస్తోంది. ఈ సినిమాలు కాకుండా నెట్ ఫ్లిక్స్ అంథాలజీ ఫిలిం ‘ఘోస్ట్ స్టోరీస్’ లో కూడా నటిస్తోంది.
Please Read Disclaimer