చక్కనమ్మ చించుకున్నా అందమే

0

కళ్లు పక్కకు తిప్పుకోనివ్వని ట్రీటివ్వడం ఎలానో జాన్వీనే అడిగి తెలుసుకోవాలి. నవతరం నాయికల్లో నిరంతరం వార్తల్లో నానడం ఎలానో జాన్వీపై కేస్ స్టడీ చేస్తే సరిపోతుంది. ఫ్యాషన్ అండ్ ట్రెండ్స్ ని అనుకరిస్తూ యువతరాన్ని కళ్లు తిప్పుకోనివ్వకుండా చేయడంలో జాన్వీ తర్వాతనే.

ఎప్పటికప్పుడు అల్ట్రా మోడ్రన్ స్టైల్స్ ని అనుకరించడం.. గుబులు రేపే ఔట్ ఫిట్ తో కనిపించడం జాన్వీకి కొత్తేమీ కాదు. లేటెస్టుగా ఈ భామ జిమ్ నుంచి వస్తూ పెద్ద షాక్ ఇచ్చింది. పిక్కల పైకి షార్ట్ తొడిగి.. మోడ్రన్ టాప్ తో దర్శనమిచ్చింది. చక్కనమ్మ చించుకున్నా అందమే అన్న చందంగా ఆ టాప్ ఫ్రాకు అన్ని కళ్లు తనవైపే తిప్పేసేంత ట్రీటిస్తోంది. జిమ్ ముగించి స్టైల్ గా అలా కార్ వరకూ వెళుతూ కవ్వించింది ఈ అమ్మడు.

కెరీర్ పరంగా చూస్తే.. జాన్వీ నటించిన కార్గిల్ గర్ల్ చిత్రం రిలీజ్ కి వస్తోంది. ఫిబ్రవరిలో జాన్వీ నటించనున్న తక్త్ షూటింగ్ ప్రారంభం కానుంది. అలాగే దోస్తానా 2 షెడ్యూల్స్ పూర్తవుతున్న సంగతి తెలిసిందే.
Please Read Disclaimer