అప్పుడే వెబ్ సిరీస్ ఏంటీ.. సినిమాలు వద్దా?

0

దివంగత స్టార్ హీరోయిన్ శ్రీదేవి నట వారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ చేసింది ఒక్క సినిమా అయినా కూడా స్టార్ హీరోయిన్ స్టేటస్ ను ఎంజాయ్ చేస్తోంది. సోషల్ మీడియాలో ఆమె క్రేజ్ అంతా ఇంతా కాదు. ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తున్న జాన్వీ కపూర్ ఆ మూడింటిని కూడా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతుంది. 2019లో ఒక్క సినిమా కూడా విడుదల చేయలేక పోయిన జాన్వీ కపూర్ ఒక వెబ్ సిరీస్ లో కూడా నటిస్తుందట.

ఈమద్య కొత్త వారి నుండి స్టార్స్ వరకు అంతా కూడా వెబ్ సిరీస్ ల వెంట పడుతున్నారు. ఆ కారణంగానే జాన్వీ కపూర్ కూడా వెబ్ సిరీస్ కు ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. ఘోస్ట్ స్టోరీస్ అనే వెబ్ సిరీస్ ను తాను చేస్తున్నాను అని.. అది 2020 జనవరి 1 అర్థరాత్రి సమయంలో నెట్ ప్లిక్స్ లో స్ట్రీమ్ కాబోతున్నట్లుగా జాన్వీ కపూర్ ప్రకటించింది. జాన్వీ కపూర్ వెబ్ సిరీస్ లు చేయడం పట్ల కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. శ్రీదేవి ఫ్యాన్స్ జాన్వీ కపూర్ వెబ్ సిరీస్ లో నటించడంను తప్పుబడుతున్నారు.

సినిమాల్లో ఇంకా నిలదొక్కుకోకుండానే అప్పుడే వెబ్ సిరీస్ ల్లో నటించాల్సిన అవసరం ఏంటీ అంటూ ప్రశ్నిస్తున్నారు. మెయిన్ గా సినిమాలపై ఆసక్తి చూపించాలంటూ ఆమెకు సలహా ఇస్తున్నారు. మొదటగా సినిమాల్లో నిలదొక్కుకుని ఆ తర్వాత సైడ్ ట్రాక్ లోకి వెళ్లాలని.. అలా కాదని మొదటి నుండి కూడా సైడ్ ట్రాక్ లో నడుస్తానంటే కెరీర్ లో నష్టపోవాల్సి వస్తుందని ఆమెను హెచ్చరిస్తున్నారు. ఘోస్ట్ స్టోరీస్ హర్రర్ బేస్డ్ వెబ్ సిరీస్. విభిన్నమైన కథాంశంతో ఆ వెబ్ సిరీస్ ఉంటుందని.. కథ నచ్చడం వల్ల జాన్వీ కపూర్ నటించేందుకు ఒప్పుకున్నట్లుగా ఆమె సన్నిహితులు చెబుతున్నారు.
Please Read Disclaimer