బిస్కెట్లు ఇచ్చేసి మనసుల్ని దోచేసిన ముద్దుగుమ్మ

0

అందం చాలామందికి ఉంటుంది. కానీ.. అందమైన మనసు ఉన్నోళ్లు తక్కువ కనిపిస్తుంటారు. ఇక.. ప్రముఖులు.. సెలబ్రిటీల్లో అందం టన్నుల లెక్కన ఉన్నా.. సాటి మనిషి పట్ల వారు ప్రదర్శించే అభిమానం.. జాలి.. దయ లాంటివి వారికి మరింత వన్నె తెచ్చిపెడుతుంది. ఇప్పుడు అలాంటి తీరునే ప్రదర్శిస్తూ.. తన అందాన్ని మరింత రెట్టింపు చేసుకోవటమే కాదు.. మనసుల్ని దోచేస్తుంది అతిలోక సుందరి కమ్ దివంగత శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్.

నిన్న మొన్నటివరకూ చిన్నపిల్లలా కనిపించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పటి యూత్ కు తన అందంతో నిద్ర లేకుండా చేస్తోంది. నటనతో ఇప్పటికే మార్కులు వేయించుకున్నఆమె.. పలు సందర్భాల్లో తన తీరుతో అందరి మనసుల్ని దోచేస్తుంది. ఆ మధ్యన జిమ్ చేసి బయటకు వచ్చిన జాన్వీ కారు ఎక్కుతున్న వేళ.. ఒక బాలుడు మ్యాగ్ జైన్స్ అమ్మటానికి వస్తే.. తన దగ్గర డబ్బులు లేకున్నా.. డ్రైవర్ ను అడిగి తీసుకొని మరీ మ్యాగ్ జైన్ కొనటం ఆమె దయార్థ మనసుకు ఉదాహరణగా చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. తాజాగా ముంబయిలోని జుహూ ప్రాంతానికి షాపింగ్ కు వెళ్లిన ఆమె.. తన కారు దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చిన ఒక వీధి బాలుడ్ని గమనించి.. తన కారులో ఉన్న బిస్కెట్ ప్యాకెట్లను ఆ పిల్లాడికి ఇచ్చిన వేళలో తీసిన ఫోటో వైరల్ గా మారింది. అయితే.. ఆ టైంలో జాన్వీతో పాటు ఆమె బాయ్ ఫ్రెండ్ గా చెప్పే ఇషాంత్ ఖట్టర్ కూడా అక్కడే ఉండటాన్ని పలువురు ప్రస్తావిస్తున్నారు. ఏమైనా.. కంటికి కనిపించే అందమే కాదు.. కనిపించని దయలోనూ జాన్వీ మస్తు అందగత్తెనని చెప్పటానికి సందేహించాల్సిన అవసరం లేదు.
Please Read Disclaimer