వర్కవుట్ చేశాక ఏమిటా మతలబు జాన్వీ?

0

గత కొంతకాలంగా అందాల జాన్వీ ఏం చేసినా అది యూత్ లో ట్రెండ్ సెట్టింగ్ అయిపోతోంది. జిమ్ కి వెళ్లినా.. మార్కెట్ కి వెళ్లినా లేక ఏదైనా ఫంక్షన్ కి వెళ్లినా అసలు జాన్వీ ఎలాంటి లుక్ తో కనిపిస్తోంది. తాను ఎంచుకున్న ఆ ఫ్యాషన్ ఎలాంటిది? అని యూత్ పరిశీలిస్తోంది. ఒక రకంగా సోనమ్ కపూర్ తర్వాత మళ్లీ అంతటి ఫ్యాషనిస్టాగా జాన్వీ … కపూర్ ఫ్యామిలీలో పాపులరైంది.

గత కొంతకాలంగా జిమ్ కి వెళితే టైట్ ఫిట్ దుస్తుల్లో కనిపించి బోయ్స్ కంటికి కునుకుపట్టనీకుండా చేసేది. అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు ఇప్పటికే అంతర్జాలంలో వైరల్ అయ్యాయి. సోషల్ మీడియాల్లో వీటిపై పెద్ద డిబేటే నడుస్తోంది. తాజాగా జాన్వీకి సంబంధించిన మరో కొత్త లుక్ రివీలైంది.

ఈసారి కూడా వర్కవుట్లు పూర్తి చేసుకుని అటుపై ఓ జిమ్ నుంచి వెళుతూ కనిపించింది. అయితే ఈసారి మునుపటితో పోలిస్తే చాలా డిఫరెంటుగానే కనిపించింది. డీప్ వీ-నెక్.. లాంగ్ డ్రెస్ లో సంథింగ్ డిఫరెంటుగానే కనిపించింది. అయితే వల్లంతా చెమటలతో తడిసిన ఆ లుక్ లో అందాల ఎలివేషన్ ని దాచలేకపోయింది. అలా నడుచుకుని వెళుతున్న జాన్వీనే కళ్లన్నీ వెంటాడాయి. అయితే తన లాంగ్ కోట్ వెనక అసలు మతలబేంటో ఆ తర్వాత కుర్రకారుకి అర్థమైంది. వాస్తవానికి జాన్వీ జిమ్ లో ధరించింది టైట్ ఫిట్ స్పోర్ట్ డ్రెస్. కానీ జిమ్ నుంచి బయటకు వచ్చేప్పుడే ఈ లాంగ్ ఫ్రాకుతో కవర్ చేసేసిందన్నమాట.

ఇక కెరీర్ పరంగా చూస్తే జాన్వీ ఇప్పటికిప్పుడు నాలుగు సినిమాల్లో నటిస్తోంది. గుంజన్ సక్సేనా బయోపిక్ ది కార్గిల్ గర్ల్ రిలీజ్ కి వస్తోంది. అలాగే నెట్ ఫ్లిక్స్ వెబ్ సిరీస్ ఇప్పటికే లైవ్ అయ్యింది. మరోవైపు తక్త్ అనే చిత్రంలో నటిస్తూనే దోస్తానా 2లోనూ వేడెక్కించబోతోంది.
Please Read Disclaimer