స్టార్ కిడ్ హ్యాండ్ బ్యాగుల బిల్లుతో ఇల్లు కట్టొచ్చు

0

బాలీవుడ్ రైజింగ్ యంగ్ బ్యూటీస్ లో జాన్వీకపూర్ స్పీడ్ తెలిసిందే. శశాంక్ ఖైతాన్ తెరకెక్కించిన ధడక్ చిత్రంతో తెరంగేట్రం చేసిన ఈ బ్యూటీ అద్భుత నటనతో హృదయాలను గెలుచుకుంది. ఇటీవల జోయా అక్తర్ `ఘోస్ట్ స్టోరీస్` వెబ్ సిరీస్ లో అద్భుత ప్రదర్శన తో మైమరిపించింది. జాన్వి వరుసగా కార్గిల్ గర్ల్- తక్త్- దోస్తానా 2 లాంటి భారీ చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాల రాక కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు దేవరకొండ – పూరి ఫైటర్ కోసం జాన్వీ ని ఓకే చేయాలన్న ప్రయత్నాలు సాగుతున్నాయి.

నటన .. కెరీర్ ఇవన్నీ ఒకవైపు అనుకుంటే… స్టైల్ అండ్ సెన్స్ కు సంబంధించి జాన్వీ ఇతర నాయికల కంటే ముందుంది. రెగ్యులర్ గా తన స్టైలిష్ లుక్స్ తో అబ్బురపరుస్తోంది. ప్రత్యేక అలంకరణలో భాగంగా పదే పదే తన ఖరీదైన హ్యాండ్ బ్యాగుల సేకరణతోనూ టాక్ ఆఫ్ ది టౌన్ అవుతోంది. జాన్వీ ధరించే జిమ్ బ్యాగ్స్ నుండి ట్రావెల్ బ్యాగ్స్ వరకు అన్నీ కాస్ట్ లీనే. జాన్వీకి హ్యాండ్ బ్యాగుల పిచ్చి అంతే ఇదిగా ఉంది. అసలు ఈ హ్యాండ్ బ్యాగ్ ల ఖరీదు ఎంతో పరిశీలిస్తే షాక్ తినాల్సిందే.

స్కై బ్లూ చైన్ స్లింగ్ బ్యాగ్ తో జాన్వీ కెరీర్ మొదలైంది. ధడక్ చిత్రంలో నటించేప్పుడే.. ప్రఖ్యాత లూయిస్ విట్టన్ స్కై బ్లూ చైన్ స్లింగ్ బ్యాగ్ను మోసుకెళ్ళేది. దానిపై కొన్ని ఫంకీ పాచెస్ గుండెల్ని టచ్ చేసేవి. ఈ బ్యాగ్ ధర రూ .1.6 లక్షలు. అలాగే తరచుగా గోయార్డ్ సెయింట్ లూయిస్ బూడిద టోట్ బ్యాగ్ తో కనిపిస్తుంది. దీని ధర రూ.1.50 లక్షలు. మోస్చినో స్పాంజ్బాబ్ బకెట్ బ్యాగ్ ఒకటి జాన్వీకి ఉంది. ఇటాలియన్ లగ్జరీ హౌస్ డిజైన్ చేసిన ఈ అందమైన బ్యాగ్ ధర రూ .65000. జాన్వి డెనిమ్ – నియాన్ బాయ్ చానెల్ బ్యాగ్ తో దీని ధర రూ. 313400. ప్రత్యేకించి ఛానెల్ వింటేజ్ స్క్వేర్ సిసి ఫ్లాప్ బాగ్ క్విల్టెడ్ లాంబ్స్కిన్ మీడియంను కలిగి ఉంది. ఇది స్వచ్ఛమైన గొర్రె చర్మంతో తయారు చేసినది. దీని ధర రూ. 213640.
Please Read Disclaimer