ఆ విమర్శలు చేసేవారిని నేనేం తప్పుబట్టను

0

శ్రీదేవి నట వారసురాలిగా జాన్వీ కపూర్ కు ఇండస్ట్రీలోకి ఎంట్రీ చాలా ఈజీగానే లభించింది. జాన్వీ కపూర్ కు మాత్రమే కాకుండా బాలీవుడ్ లో పలువురు స్టార్ కిడ్స్ కు అవకాశాలు చాలా ఈజీగా వస్తున్నాయి. వారు ఎలాంటి కష్టం లేకుండానే పెద్ద సినిమాల్లో నటిస్తూ పెద్ద స్టార్ట్ పిలిపించుకుంటున్నారు. నటనలో ఓనమాలు తెలియకున్నా కూడా కొందరు హీరోయిన్ గా పరిచయం అవుతున్నారు అంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు. కంగనాతో పాటు ఆమె సోదరి రంగోలీ కూడా స్టార్ కిడ్స్ పై సమయం వచ్చినప్పుడల్లా విమర్శలు చేస్తూనే ఉన్నారు.

స్టార్స్ వారసులుగా ఎంట్రీ ఇచ్చిన వారు ఎంతో మంది ప్రస్తుతం ఈ విమర్శల కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. స్టార్ కిడ్స్ గా పరిచయం అయినా కూడా తమ ట్యాలెంట్ తో తమను తాము నిరూపించుకున్న తర్వాత కూడా ఇంకా స్టార్ కిడ్స్ అంటూ విమర్శలు చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాని జాన్వీ కపూర్ మాత్రం తనకు ఆ ఇబ్బంది లేదు అంటుంది.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో జాన్వీ కపూర్ మాట్లాడుతూ.. స్టార్ కిడ్ అవ్వడం వల్ల నాకు ఇండస్ట్రీలో పెద్దగా ఇబ్బందులు పడకుండా అవకాశాలు వచ్చిన మాట నిజమే. కాని నన్ను నేను నిరూపించుకునేందుకు ప్రస్తుతం చాలా కష్ట పడుతున్నాను. స్టార్ కిడ్స్ అంటూ నన్ను విమర్శించే వారిని నేను తప్పుబట్టను. ఎందుకంటే ఒక్క ఛాన్స్ కోసం ప్రాణం పోయేలా ప్రయత్నాలు చేస్తున్న వారు ఎంతో మంది ఉన్నారు. అలాంటప్పుడు మాకు ఛాన్స్ వచ్చిందంటే కొందరు విమర్శలు చేయడం కామనే. కాని ఛాన్స్ ఈజీగా వచ్చిన స్టార్ డం మాత్రం అంత ఈజీగా రాదని.. దాని కోసం చాలా కష్టపడాలని.. ప్రతి ఒక్కరు కూడా ఆ విషయాన్ని గుర్తించాలని జాన్వీ కపూర్ ఆ ఇంటర్వ్యూ లో కోరింది.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-