రియల్ పైలెట్ తో వెండితెర పైలెట్

0

రణభూమిలో ధీరత్వం చూపించిన వీరవనితల జీవితకథలు ఎంతో స్ఫూర్తిని నింపుతాయి. స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్న ఝాన్సీ లక్ష్మీ భాయ్ వీరత్వం గురించి చరిత్ర ఎంతో గొప్పగా చెప్పుకుంది. అదే తరహాలో నేటితరం వారియర్ క్వీన్ గా గుంజన్ సక్సేనా స్ఫూర్తి నింపింది. 1999లో ఇండియా- పాక్ బార్డర్ వార్ లో గుంజన్ పాత్ర గురించి తెలిసిందే. ఈ యుద్ధంలో భారత వైమానిక దళానికి చెందిన డేరింగ్ లేడీ పైలెట్ గా గుంజన్ సక్సేనా సాహసాల గురించి భారతదేశం యావత్తూ యువతరం మాట్లాడుకుంది. ఈ యుద్ధంలో శత్రువుపై దాడులకు బయల్దేరిన యుద్ధవిమానాన్ని నడిపించిన ధీరత్వం చూపించినందుకు గుంజన్ సక్సేనాకు భారత ప్రభుత్వం గప్పగా సత్కరించింది. అలాంటి రియల్ ఫైటర్ లేడీ పాత్రలో నటిస్తున్నందుకు జాన్వీ కపూర్ లక్కీ అనే చెప్పాలి. `గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్` చిత్రం ప్రస్తుతం సెట్స్ పై ఉంది.

ఈ చిత్రంలో నిజమైన సాహసి గుంజన్ పాత్రలో నటించే అవకాశం తనకు దక్కినందుకు జాన్వీ ఉబ్బితబ్బిబ్బవుతోంది. నేడు రియల్ గుంజన్ సక్సేనా బర్త్ డే సందర్భంగా వెండితెర గుంజన్ జాన్వీ కపూర్ తనతో కలిసి దిగిన ఓ ఫోటోని షేర్ చేసారు. “హ్యాపీ బర్త్ డే గుంజన్ మ్యామ్. సిసలైన ధైర్యానికి ప్రతీక మీరు. మీరే నా హీరో.. నా నిజమైన స్ఫూర్తి`. లక్షలాది మంది మహిళలకు మీ హార్డ్ వర్క్ ధైర్యం స్ఫూర్తి. నాపై నాకు నమ్మకం పెరిగేందుకు.. ఎంతో నేర్చుకునేందుకు మీరు కారణం“ అంటూ ఎమోషన్ అయ్యింది జాన్వీ.

లేత బులుగు రంగు లో ఐఏఎఫ్ అధికారుల యూనిఫామ్ ని ధరించి ఉన్న జాన్వీ చాలా స్పెషల్ గా కనిపిస్తోంది ఈ ఫోటోలో. ఇటీవలే గుంజన్ సక్సేనా ఫస్ట్ లుక్ పోస్టర్లను రిలీజ్ చేసినప్పుడు వాటికి అద్భుత స్పందన వచ్చింది. మార్చిలో ఈ చిత్రం రిలీజ్ కానుంది. అలాగే గుంజన్ పాత్రలో నటిస్తున్న తన సోదరిని చూస్తే గర్వంగా ఉందని జాన్వీ సోదరుడు అర్జున్ కపూర్ ట్వీట్ చేయడం ఆసక్తికరం.Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home