శ్రీదేవితో చిన్నారి చిట్టెమ్మ ఎవరో?

0

సోషల్ మీడియాలో జాన్వీ స్పీడ్ గురించి తెలిసిందే. అక్కడ రకరకాల ఫోటోలు వీడియోలతో నిరంతరం యూత్ కి కావాల్సినంత ట్రీట్ ఇస్తోంది. జిమ్ కి వెళ్లినా.. క్లబ్ కి వెళ్లినా.. ఫ్టైల్ కి వెళ్లినా లేదూ రెస్టారెంట్ మార్కెట్ ఏదో చోటికి వెళ్లినా అక్కడ మీడియా కెమెరాలు అదే పనిగా వెంటాడుతూనే ఉంటాయి.

ఇక అదంతా ఒకెత్తు అనుకుంటే జాన్వీ తన ఇన్ స్టాగ్రమ్ లో వ్యక్తిగత ఫోటోలు.. ఫ్యామిలీకి సంబంధించిన ట్రెడిషనల్ ఫోటోల్ని షేర్ చేస్తూ ఆశ్చర్యపరుస్తోంది అప్పుడప్పుడు. తాజాగా చిన్నారి జాన్వీ మామ్ శ్రీదేవితో ఉన్న ఫోటో ఒకటి అంతర్జాలంలో వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో జాన్వీ నవ్వులు చిందిస్తూ ఎంతో క్యూట్ గా కనిపిస్తోంది. జాన్వీని బాలీవుడ్ అగ్ర కథానాయికగా చూడాలన్న కోరిక మామ్ కి ఉండేది. అయితే తన మొదటి సినిమాని అయినా కనులారా వీక్షించే భాగ్యం లేకుండానే అనంతలోకాలకు తరలి వెళ్లింది. శ్రీదేవి మరణ వార్త విన్న జాన్వీ ఆన్ లొకేషన్ కన్నీరు మున్నీరైన దృశ్యాలు ఇప్పటికీ అభిమానుల కళ్ల ముందే మెదులుతాయి. అందుకే తన జీవితంలో ప్రతి ఎమోషనల్ మూవ్ మెంట్ ని జాన్వీ పంచుకున్నప్పుడు అవి అభిమానులకు ఎంతో చేరువ అయిపోతున్నాయి.

జాన్వీ నటించిన కార్గిల్ గర్ల్ రిలీజ్ కి రెడీ అవుతోంది. తదుపరి తక్త్ చిత్రంలో నటించనుంది. భారీ క్రేజీ చిత్రం దోస్తానా 2 ఇప్పటికే కొన్ని షెడ్యూల్స్ ని పూర్తి చేసుకుంది. జాన్వీ కెరీర్ లైనప్ అంతకంతకు ఇండస్ట్రీ వర్గాల్ని అభిమానుల్ని ఆశ్చర్యపరుస్తున్న సంగతి తెలిసిందే.
Please Read Disclaimer