వదినమ్మగా మలైకా కంటే రకుల్ బెటర్

0

బాలీవుడ్ లో హాటెస్ట్ కపుల్ గా నిత్యం వార్తల్లో నిలుస్తున్న జోడీ అర్జున్ కపూర్- మలైకా అరోరా. గత కొంత కాలంగా డేటింగ్ లో వుంటూ ముంబై వీధుల్లో చెట్టపట్టాలేసుకుని తిరుగుతున్న ఈ జంట ఎప్పుడెప్పుడు పెళ్లి వార్త చెబుతుందా? అని బాలీవుడ్ జనాలంతా ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. వారి ఎదురుచూపులకు ఫుల్ స్టాప్ పెడుతూ మలైకా పెళ్లి మాట ఇప్పట్లో లేదని క్లారిటీ ఇచ్చింది. ఆ క్రమంలోనే పెళ్లికి కొంత సమయం పడుతుందని అభిమానులు భావిస్తున్నారు. ఇంతలోనే మరో ఊహించని ట్విస్టు.

తాజాగా రకుల్ తో అర్జున్ కపూర్ ఎంతో సన్నిహితంగా చిలౌట్ మూవ్ మెంట్ లో ఉన్న ఫొటోని షేర్ చేసిన సిస్టర్ జాన్వీకపూర్ క్యూట్ కపుల్!! అని క్యాప్షన్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. మలైకా అరోరాతో అర్జున్ కపూర్ త్వరలో పెళ్లికి సిద్ధమవుతున్నాడన్న స్పెక్యులేషన్స్ నేపథ్యంలో చెల్లెలు జాన్వీ సోషల్ మీడియా వేదికగా `క్యూట్ జోడీ` అంటూ కామెంట్ చేయడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మలైకా వింటున్నావా ఇది? అంటూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. అర్జున్ కపూర్- రకుల్ ప్రీత్సింగ్ కలిసి తాజాగా ఓ చిత్రంలో నటిస్తున్నారు. భూషణ్ కుమార్- నిఖిల్ అద్వానీలతో కలిసి ఈ చిత్రాన్ని హీరో జాన్ అబ్రహం నిర్మిస్తున్నారు. కాశ్వీనాయర్ డైరెక్టర్ గా పరిచయమవుతున్నారు.

రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా ఇటీవలే మొదలైంది. దీనికి సంబంధించిన స్టిల్స్ ని ఇన్ స్టాలో పోస్ట్ చేసిన అర్జున్ కపూర్ … `సినిమా మొదలైంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాల్ని త్వరలో తెలియజేస్తాం` అని రకుల్ తో వున్న క్యూట్ రొమాంటిక్ ఫొటోలని పోస్ట్ చేశాడు. దీనిపై జాన్వీతో పాటు నెటిజనులు జోరుగా కామెంట్ లు చేయడం ఆసక్తికరంగా మారింది.
Please Read Disclaimer