సినిమాల కంటే పొట్టి నిక్కరు షో లెక్కువ

0

జనాల అటెన్షన్ నిరంతరం తమపైనే ఉండాలంటే ఏం చేయాలి? ఏదో ఒక ఆకర్షణ పెంచే పని ఒకటి చేయాలి. లేదంటే మనల్ని పట్టించుకునేది ఎవరు? గుంపులో గోవిందంలా మిగిలిపోయే కంటే ఏదో ఒకటి చేసి అటెన్షన్ ఇటువైపు మళ్లించాలి. లేదంటే అంతా మర్చిపోతారు. ఇలాంటి బెంగ సెలబ్రిటీ కిడ్స్ కి ఉంటుంది. అసలు తమని ఎవరైనా చూస్తున్నారా లేదా? చూడకపోతే చూసేందుకు ఏం చేయాలి? ఇతరులతో పోటీని ఎదుర్కొని క్రేజు పెంచుకోవాలంటే ఏం చేయాలి? అంటూ నిరంతరం ఆలోచిస్తూనే ఉంటారు.

ముంబై పరిశ్రమలో గ్లామర్ అండ్ గ్లిజ్ ప్రపంచంలో ఉన్న కాంపిటీషన్ ని దృష్టిలో పెట్టుకుని నేటితరం స్టార్ కిడ్స్ తెలివైన మంత్రాంగమే నడిపిస్తున్నారు. ఇక అలాంటి వాళ్లలో అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ ముందు వరుసలో ఉంటోంది. నిరంతరం ఏదో ఒక విజువల్ ట్రీట్ ఇస్తూ నెటిజనుల్ని తనవైపు తిప్పేసుకుంటోంది. ఇప్పటికే ఇన్ స్టాగ్రమ్ లో జాన్వీకి అసాధారణ ఫాలోవర్స్ ఉన్నారు. ఇంకా ఇంకా ఫాలోయింగ్ పెరుగుతూనే ఉంది.

నటించింది ఒక్క సినిమానే అయినా .. జాన్వీ దూసుకొచ్చిన తీరు ఒక రకంగా విస్మయపరుస్తోంది. తొలి సినిమా ధడక్ లో నటించేప్పుడు అసలు కెమెరాకి ఫోజివ్వాలంటేనే ఏదోలా ఉండేదట. కానీ ఇప్పుడు అది రొటీన్ వ్యాపకమే అయిపోయింది. వీధుల్లో వెళ్లినా.. జిమ్ముకి వెళ్లినా.. మార్కెట్ కి వెళ్లినా ముంబై ఫోటోగ్రాఫర్లు వెంటాడి మరీ ఫోటోలు తీస్తున్నారు. వాళ్లకు హాయ్ చెప్పేస్తూ గిలిగింతలు పెట్టే ఫోజులు ఇచ్చేస్తోంది. ఇక చిట్టి పొట్టి నిక్కర్లతో నిరంతర ట్రీట్ కైతే కొదవే లేదు. ఎప్పటికప్పుడు లేటెస్టు ఫోటోషూట్లతో మంటలు పెడుతోంది. తాజాగా అలాంటి ఓ ట్రీట్ ఇచ్చింది జాన్వీ. బులుగు నిక్కరు.. వైట్ టాప్ తో టాప్ లేపేసింది అంతే! జాన్వీ నటిస్తున్న మూడు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. ఇందులో కార్గిల్ గర్ల్ – గుంజన్ సక్సేనా సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. భారీ హిస్టారికల్ ఫిక్షన్ మూవీ తక్త్ రెగ్యులర్ చిత్రీకరణ జరుగుతోంది. వీటన్నిటినీ మించి దోస్తానా 2లో యువహీరోలతో రొమాన్స్ చేస్తూ జాన్వీ దూసుకొస్తోంది. ఈ సినిమాలో జాన్వీ బికినీ ట్రీట్ కి సంబంధించిన లుక్ ఇంతకుముందు సెగలు పుట్టించిన సంగతి తెలిసిందే.