ఇండోర్ ఫ్లైయింగ్ క్లబ్ లో హీరోయిన్ ఏం చేస్తోంది?

0

బాలీవుడ్ లో బయోపిక్ ల హవా జోరుగా సాగుతోందనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం దాదాపుగా అరడజను పైగా బయోపిక్ లు షూటింగ్ దశలో ఉన్నాయి. అవి కాకుండా మరికొన్ని బయోపిక్ లు ప్లానింగ్ దశలో ఉన్నాయి. ఇలా ప్లానింగ్ దశలో ఉన్న బయోపిక్స్ లో ‘కార్గిల్ గర్ల్’ ఒకటి. కార్గిల్ యద్ధంలో పాల్గొన్న మహిళా పైలట్ గుంజన్ సక్సేనా జీవితం ఆధారంగా ఈ బయోపిక్ ను ప్లాన్ చేస్తున్నారు.

యుద్ధరంగంలో మొదటిసారిగా విమానాన్ని నడిపిన మొదటి భారతీయ మహిళగా గుంజన్ సక్సేనా రికార్డు సృష్టించారు. కార్గిల్ వార్ లో గుంజన్ చూపించిన ధైర్యసాహసాలను గుర్తించి ఆమెకు శౌర్యచక్ర బిరుదును ప్రదానం చేశారు. ఇప్పుడు గుంజన్ సక్సేనా బయోపిక్ లో శ్రీదేవి కుమార్తె జాన్వి కపూర్ నటిస్తోంది. ఈ సినిమాలో గుంజన్ పాత్రను సహజంగా పోషించడానికి జాన్వి ప్రస్తుతం పైలట్ ట్రైనింగ్ తీసుకుంటోంది. భారతదేశంలో అత్యుత్తమ పైలట్ ట్రైనింగ్ సెంటర్ గా పేరున్న ఇండోర్ ఫ్లైయింగ్ క్లబ్ లో ఆమె పైలట్ ట్రైనింగ్ తరగతులకు హాజరవుతున్నారు. గతంలో ‘మౌసమ్’ సినిమా కోసం బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ కూడా ఇదే ట్రైనింగ్ సెంటర్ లో పైలట్ ట్రైనింగ్ తీసుకోవడం గమనార్హం.

‘కార్గిల్ గర్ల్’ చిత్రానికి శరణ్ శర్మ దర్శకుడు కాగా పంకజ్ కపూర్.. అంగద్ బేడి ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా మెజారిటీ భాగం లక్నో నగరంలోనూ.. లక్నో చుట్టుపక్కల తెరకెక్కిస్తారని సమాచారం. ‘ధడక్’ సినిమా తో హీరోయిన్ గా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన జాన్వి ప్రస్తుతం ‘తఖ్త్’ అనే మరో భారీ బడ్జెట్ చిత్రంలో కూడా నటిస్తోంది.




Please Read Disclaimer