అదే పనిగా థై షోస్ ఏమిటో

0

`ధడక్` చిత్రంతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది జాన్వీ కపూర్. ఆ తర్వాత ఇంతవరకూ అసలు ఈ భామ నటించిన సినిమా ఏదీ రాలేదు. ఒకదాని వెంట ఒకటిగా సినిమాలు మాత్రం సెట్స్ పై ఉన్నాయి. కార్గిల్ గర్ల్ – రూహి ఆఫ్జా చిత్రీకరణలు ముగిసినా ఇంకా నిర్మాణానంతర పనులతో బిజీ. ప్రస్తుతం జాన్వీ దోస్తానా 2 షూటింగ్ లో ఉంది. ఇంత బిజీ షెడ్యూల్స్ లోనూ ఫిట్ నెస్ ఫ్రీక్ జాన్వీ కపూర్ జిమ్ ని మాత్రం అస్సలు విడిచిపెట్టదు. ప్రతి రోజూ కనీసం ఒక గంట అయినా జిమ్ లో గడపాల్సిందే.

తాజాగా ముంబైలోని ఓ జిమ్ నుంచి కసరత్తులు ముగించుకుని తిరిగి వెళుతున్నప్పటి ఫోటోలు అంతర్జాలంలో వైరల్ అవుతున్నాయి. వైట్ ఫ్రాకు.. పొట్టి నిక్కరులో థై సొగసుల్ని ప్రదర్శిస్తున్నన్న లుక్ యూత్ లోకి దూసుకెళుతోంది. ఇక అలా వెళుతున్న జాన్వీ పెదవులపై చెరగని ఆ చిరునవ్వు అన్నివేళలా ప్రత్యేక ఆకర్షణ అనే చెప్పాలి. జాన్వీ రెగ్యులర్ జిమ్ ట్రీట్ ప్రతిసారీ హాట్ టాపిక్ గా మారుతోంది.

ఇక కెరీర్ పరంగా చూస్తే.. జాన్వి కపూర్ ఇటీవల నెట్ ఫ్లిక్స్ `ఘోస్ట్ స్టోరీస్`లో నటించిన సంగతి తెలిసిందే. నర్స్ పాత్రలో అద్భుత అభినయంతో ఆకట్టుకుంది. ఇక కార్గిల్ గర్ల్ చిత్రంలో వైమానిక దళ వింగ్ కమాండర్ గా జాన్వీ నటన ఎలా ఉండనుందో తెరపై చూడాల్సిందే. అలాగే విజయ్ దేవరకొండ- పూరి కాంబినేషన్ మూవీ ఫైటర్ కి సంతకం చేసిందా లేదా? అన్నది తెలియాల్సి ఉంది.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-