అద్దంలో నాజూకు నడుము బావుందమ్మో

0

అందంగా కనిపించాలంటే ఎంతగా శ్రమించాలో స్టార్ కిడ్ జాన్వీ ప్రతి అడుగును పరిశీలించేవారికి అర్థమవుతుంది. తన అందాన్ని కాపాడుకునేందుకు జాన్వీ పడే శ్రమ అంతా ఇంతా కాదు. నిరంతరం జిమ్ముల్లో కసరత్తులు చేస్తూ జాన్వీ సొగసైన దేహశిరుల్ని కాపాడుకుంటోంది. ప్రస్తుతం ఉన్న ఠఫ్ కాంపిటీషన్ లో సోషల్ మీడియా ఎలివేషన్ పైనా ఎక్కువ శ్రద్ధ చూపిస్తోంది. ముఖ్యంగా ఇన్ స్టా మాధ్యమంలో తన లైఫ్ లో ప్రతి మూవ్ మెంట్ ని అభిమానులతో షేర్ చేసుకుంటోంది.

ఇటీవల రెగ్యులర్ గా జిమ్ కి వెళ్లి కసరత్తులు చేస్తున్న ఫోటోల్ని.. వీడియోల్ని పోస్ట్ చేస్తూనే ఉంది. న్యూజెర్సీకి షార్ట్ ట్రిప్ వెళ్లినా అక్కడా సిస్టర్ ఖుషీతో పాటుగా జిమ్ కి వెళ్లి ఆశ్చర్యపరిచింది. కనీసం గాల్లో వెళుతున్న విమానంలో అయినా తీరిగ్గా ఉంటుందో లేదో కూడా సందేహమే. తప్పదు మరి.. రంగుల ప్రపంచంలో ఈ శ్రమ లేకపోతే పోటీలో నెగ్గుకు రావడం చాలా కష్టం.

లేటెస్టుగా జాన్వీ షేర్ చేసిన మిర్రర్ సెల్ఫీ ఫ్యాన్స్ లో వైరల్ గా మారింది. జాన్వీ సింపుల్ బ్లాక్ టీషర్ట్.. మిడ్డీ డ్రెస్ ని ధరించింది. అయితే ఈ డిజైనర్ డ్రెస్ లో జాన్వీ నడుము సొగసు గొప్పగా ఎలివేట్ అయ్యింది. మిస్ పెర్ఫెక్ట్ అని పొగిడేయాల్సిందే అన్నంతగా ఉంది. ఇక జాన్వీ కెరీర్ ని పరిశీలిస్తే.. రూహ్ అఫ్జా- ది కార్గిల్ గర్ల్- తక్త్ – దోస్తానా 2 వంటి క్రేజీ చిత్రాల్లో నటిస్తోంది.
Please Read Disclaimer