కాలి నడకన వెంకన్న మొక్కు తీర్చిన జాన్వీ

0

తిరుమలేశునికి సెలబ్రిటీల తాకిడి ఎక్కువైనట్టే కనిపిస్తోంది. సినిమాల రిలీజ్ ల సమయంలో వెంకన్న స్వామి దివ్యాశీస్సుల కోసం తప్పనిసరిగా తిరుమలకు విచ్చేస్తున్నారు. అటు కోలీవుడ్-ఇటు టాలీవుడ్ సెలబ్రిటీలు రెగ్యులర్ గా ఎటెండవుతున్నారు. మహేష్- తారక్-చరణ్- దగ్గుబాటి కుటుంబాలు తిరుమల విజిట్ తప్పనిసరి. అలాగే అటు బాలీవుడ్ సెలబ్రిటీలు తిరుమల తిరుపతి వెంకటేశుని సన్నిధానంలో భక్తి తత్పరతను ప్రదర్శించడం ఇటీవల ఎక్కువైనట్టే కనిపిస్తోంది.

తాజాగా అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలు జాన్వీ కపూర్ తిరుమలేశుని చెంతకు విచ్చేసి మొక్కు తీర్చుకోవడం అభిమానుల్లో చర్చకు వచ్చింది. జాన్వీ వైట్ సల్వార్ డ్రెస్ లో ఏడుకొండల వాడి చెంతకు విచ్చేసింది. ఆ సమయంలో పసుపు వర్ణం చున్నీని ధరించి ఎంతో సింపుల్ గా కనిపించింది. జాన్వీ సెలబ్రిటీ హోదాను పక్కన పెట్టి ఒక సామాన్యురాలిలా కాలి నడకను మెట్ల దారి గుండా వెంకన్న సామి దర్శనానికి వెళ్లడం ఆసక్తిని రేకెత్తించింది.

నడక దారిలో మెట్లపైనే కాస్త రిలాక్స్ అవుతూ కనిపిస్తున్న ఫోటోలు ప్రస్తుతం అభిమానుల్లో వైరల్ గా మారాయి. ధడక్ సినిమాతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చిన జాన్వీ వరుసగా భారీ క్రేజీ చిత్రాల్లో నటిస్తోంది. కార్గిల్ గర్ల్ – గుంజన్ సక్సేనా .. అలాగే రుహీ అఫ్జా చిత్రాలు రిలీజ్ లకు రావాల్సి ఉండగా తక్త్ ప్రస్తుతం సెట్స్ పై ఉంది. జాన్వీ కెరీర్ ని మరో స్థాయికి చేర్చబోయే చిత్రాలివి. కెరీర్ బావుండాలని జాన్వీ వెంకన్న సామికి మొక్కిందన్నమాట. అలాగే విదేశాల్లో నటశిక్షణ పొందుతున్న తన గారాల చెల్లెమ్మ ఖుషీ కపూర్ డెబ్యూ త్వరగా జరగాలని మొక్కుకుని ఉంటుందేమో!
Please Read Disclaimer