జానీ మాస్టర్‌కి ఆర్నెళ్ల జైలు శిక్ష, జరిమానా

0

టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కి ఆరు నెలలు జైలు శిక్ష విధించింది మేడ్చల్ కోర్టు. 2015లో 354, 324, 506 సెక్షన్ల కింద జానీ మాస్టర్‌పై కేసు నమోదు కావడంతో దోషులగా తేలిన జానీ మాస్టర్‌కి జైలు శిక్ష విధిస్తూ బుధవారం నాడు తీర్పునిచ్చింది మేడ్చల్ కోర్టు. ఆయనతో పాటు మరో 5 మంది దోషులుగా తేలడంతో జానీ మాస్టర్‌తో సహా జైలుకి తరలించారు.

ఈ కేసు వివారాళ్లోకి వెళ్తే.. 2015లో మేడ్చల్ మండలంలోని కండ్లకొయ్యలోని సీఎంఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో జానీ మాస్టర్ తన టీంతో కలిసి పాల్గొన్నారు. అయితే ఓ పాట విషయంలో జానీ మాస్టర్ టీమ్‌కి మరో టీమ్‌కి మధ్య గొడవ గొడవ జరిగింది. ఈ గొడవలో డ్యాన్స్ మాస్టర్ జానీ బృందం తమపై దాడికి పాల్పడ్డారని మరో బృందం మేడ్చల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసును దర్యాప్తు చేసిన పోలీసులు జానీ మాస్టర్‌తో పాటు కోయిడ వేణు, ఘన్ శ్యామ్, వెంకటరమణ, ఎర్రోళ్ల రమేష్, ఎర్రపల్లి ప్రకాష్ ముద్దాయిలుగా చేర్చారు. 2015 నుండి మేడ్చల్‌లోని సివిల్ సీనియర్ కోర్టులో ఈ కేసు విచారణ జరగగా నేడు తీర్పు వెలువడింది. సుదీర్ఘ వాదనల అనంతరం.. దాడికి పాల్పడిన డ్యాన్స్ మాస్టర్ జానీతో పాటు కోయిడ వేణు, ఘన్ శ్యామ్, వెంకటరమణ, ఎర్రోళ్ల రమేష్, ఎర్రపల్లి ప్రకాష్ లను నిందితులుగా గుర్తించింది కోర్టు. దీంతో ఒక్కొక్కరికి 6 నెలల జైలు శిక్షతో పాటు 1500 జరిమాన విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చిందని ఇచ్చిందని మేడ్చల్ సిఐ గంగాధర్ వివారాలను తెలియజేశారు.

జానీ మాస్టర్ నేపథ్యం చూస్తే.. చిన్నప్పటి నుండి చాలా కష్టపడి కూలీగా, లారీ డ్రైవర్‌గా పనిచేసిన జానీ మాస్టర్ 2009లో ద్రోణ సినిమాతో కొరియోగ్రాఫర్‌గా కెరియర్ మొదలుపెట్టారు. అప్పటి నుండి వరుసగా సినిమాలు చేస్తు స్టార్ హీరోలకు అద్భుతమైన కొరియోగ్రఫీ అందించి పేరు సంపాదించారు.

ఖైదీ నెం. 150, రంగస్థలం, అరవింద సమేత, బాహుబలి, సన్నాఫ్ సత్యమూర్తి, రేసుగుర్రం వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలకు పనిచేసిన చిరంజీవి, రామ్ చరణ్, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్‌, రామ్ చరణ్‌లతో స్టెప్పులేయించారు.

జిగేలు రాణి.. సినిమా చూపిస్తా మామా.. లైలా ఓలైలా.. మీ తాత టెంపర్.. కమ్ టు ద పార్టీ.. పిల్లా నువ్వు లేని జీవితం.. వంటి బ్లాక్ బస్టర్ మ్యూజికల్ హిట్స్ సాంగ్‌కి అదిరిపోయే స్టెప్పులను ఇచ్చి టాప్ కొరియోగ్రాఫర్ అనిపించుకున్నారు జానీ మాస్టర్. కొరియోగ్రాఫర్‌గానే కాకుండా.. ఈటీవీ ‘ఢీ’ డాన్స్‌ షో కొరియోగ్రాఫర్‌గా.. ఢీ జూనియర్స్‌ 2‌కి మెంటర్‌గా.. ఢీ జోడీకి మెంటర్‌గా పనిచేసి.. మా టీవీలో ప్రసారమైన ‘నీతోనే డాన్స్’ షోకి జడ్జ్‌గా వ్యవహరించారు. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ చిత్రాలకు పనిచేశారు జానీ మాస్టర్.
Please Read Disclaimer