జర్రా జర్రా వాల్మీకి మాస్ – వీడియో సాంగ్

0

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా రూపొందుతున్న వాల్మీకి మొదటి ఆడియో సింగల్ తాలుకు వీడియో ప్రోమోని రిలీజ్ చేసింది యూనిట్. అవుట్ అండ్ అవుట్ మాస్ ఐటెం నెంబర్ గా మిక్కీ జె మేయర్ ట్యూన్ చేసిన ఈ పాట ఫుల్ కిక్కిచ్చేలా ఉంది. జర్రా జర్రా అచ్చా జర్రా జర్రా కచ్చా నేను ఇంతే చిచ్చా చంద్రుడికైనా లేదా మచ్చా అంటూ వరుణ్ తేజ్ గన్ను పట్టుకుని నల్ల చొక్కా పంచెతో చేసిన రచ్చకు ధియేటర్లలో ఈగలు గోలలు ఖాయమే.

ఒకరకంగా ఇది హీరో ఇంట్రో కం ఐటెం సాంగ్ లా ఉండటం విశేషం.సాఫ్ట్ జానర్ మూవీస్ కి కూల్ మ్యూజిక్ ఇచ్చే మిక్కి జే మేజర్ ఇలాంటి ఎనర్జిటిక్ కంపోజింగ్ ఇవ్వడం ఇప్పటికే హాట్ టాపిక్ గా నిలిచింది. దానికి తగ్గట్టే ఇప్పుడు విజువల్స్ కూడా అదిరిపోయాయి. వచ్చే నెల 13న విడుదల కానున్న వాల్మీకి మీద మంచి ఊపోచ్చే రేంజ్ లో హైప్ తెచ్చేలా ఈ పాట సాగడం విశేషం.

ఈ వీడియో ప్రోమోలో తమిళ హీరో అధర్వతో పాటు ఐటెం డాన్స్ చేసిన మోడల్ ఉన్నప్పటికీ దృష్టి మొత్తం తన మీద పడేలా వరుణ్ తేజ్ లుక్స్ తోనే అదరగొట్టాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన వాల్మీకి తమిళ బ్లాక్ బస్టర్ జిగర్ తండాకు అఫీషియల్ రీమేక్. పూజా హెగ్డే హీరొయిన్ గా నటిస్తుండగా పాజిటివ్ ప్లస్ నెగటివ్ షేడ్స్ ఉన్న ఒక డిఫరెంట్ రోల్ ని వరుణ్ తేజ్ ఇందులో చేయడం విశేషం
Please Read Disclaimer