అమ్మ బయోపిక్.. MGR ఇంత స్మార్ట్ గానా?

0

అమ్మ జయలలిత పై ఒకేసారి రెండు బయోపిక్ లు తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మరో వైపు వెబ్ సిరీస్ కి సన్నాహాలు చేస్తున్నారు. ఇంత ఠఫ్ కాంపిటీషన్ లోనూ ఎవరికి వారు యూనిక్ స్టైల్లో ఈ బయోపిక్ ని తెరకెక్కించే ఆలోచనల తో ముందుకెళుతున్నారు. దివంగత నటి కం నాయకురాలి జీవిత కథను ఎవరికి వారు ప్రత్యేకంగా తీర్చిదిద్దుతున్నారట.

క్వీన్ కంగన కథానాయిక గా ఏ.ఎల్.విజయ్ దర్శకత్వం లోని బయోపిక్ ఈ ఆదివారం లాంఛనంగా పూజా కార్యక్రమాల తో ప్రారంభం కాగా.. ఈ గురువారం నుంచి రెగ్యులర్ చిత్రీకరణను ప్రారంభించారు.. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ బయోపిక్ నిర్మాత విష్ణు ఇందూరి నిర్మిస్తున్నారు. విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్టు అందించారు. ఇక క్వీన్ కంగన సహా ఎంజీఆర్ పాత్రధారి అరవింద స్వామిపై కీలక సన్నివేశాలు సినిమా కే హైలైట్ గా ఉండనున్నాయని తెలుస్తోంది.

లెజెండరీ నటుడు.. తమిళుల అభిమాన నాయకుడు ఎంజీఆర్ పాత్ర లో అరవింద స్వామి నటిస్తుండడం తో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఇక ఎంజీఆర్ అంటే స్మార్ట్ అండ్ క్లాస్ అప్పియరెన్స్ తో కనిపించాలి. ఆ పాత్ర ఆహార్యం కోసం అరవింద స్వామి ప్రిపరేషన్ ఎలా ఉందో తాజా గా రివీలైన ఫోటో ఒకటి చెబుతోంది. మీసం గడ్డం ఏదీ లేకుండా స్మార్ట్ గా సింపుల్ గా కనిపిస్తున్నారు. జయలలిత లుక్ కోసం ఏకం గా హాలీవుడ్ నుంచి స్పెషలిస్టు ని బరిలో దించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం తమిళం నేర్చుకున్నానని కంగన చెబుతోంది. తమిళం-హిందీ లో ప్రధానం గా ఈ చిత్రం రూపొందనుంది. తెలుగు లోనూ రిలీజ్ చేయనున్నారని క్వీన్ ఓ ఇంటర్వ్యూ లో వెల్లడించింది. ఇందులో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ దివంగత ముఖ్యమంత్రి కరుణానిధి గా నటిస్తున్నారు.
Please Read Disclaimer