ప్రిన్స్ తల్లి పాత్రలో అలనాటి అందాల తార?

0టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుపూజ హెగ్డేల కాంబోలో వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తోన్న `మహర్షి` సినిమాపై భారీ అంచనాలున్నసంగతి తెలిసిందే. మహేష్ 25వ సినిమా అయిన మహర్షిని వైజయంతి మూవీస్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పీవీపీ సినిమా బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అల్లరి నరేష్ ఓ కీలక పాత్రలో కనిపించబోతోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కు సంబంధించి ఓ పుకారు టాలీవుడ్ లో షికారు చేస్తోంది. మహేష్ తల్లిగా సీనియర్ స్టార్ హీరోయిన్ జయప్రద నటించబోతున్నారంటూ టాలీవుడ్ లో పుకార్లు వస్తున్నాయి. ప్రస్తుతం రాజకీయాలలో అంత యాక్టివ్ గా లేని జయప్రద చాలాకాలం తర్వాత ఓ తెలుగు సినిమాలో నటించబోతుండడం విశేషం.

కాగా `మహర్షి` ఫస్ట్ లుక్ – టీజర్ ను ….ప్రిన్స్ బర్త్ డే గిఫ్ట్ గా చిత్ర యూనిట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ టీజర్ ప్రిన్స్ అభిమానులతో పాటు పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలను ఆకట్టుకుంది. ముఖ్యంగా యంగ్ కాలేజ్ స్టూడెంట్ గా మహేష్ లుక్ విపరీతంగా ఆకట్టుకుంది. ‘మహర్షి’ ఫస్ట్ లుక్ తనను సర్ ప్రైజ్ చేసిందని ఆ లుక్ ఫ్రెష్ గా – ప్రెస్టీజియస్ గా ఉందని పలువురు కితాబిచ్చారు. టీజర్ కు విపరీతమైన రెస్పాన్స్ వస్తోన్న నేపథ్యంలో….ఈ చిత్రంపై అంచనాలు మరింత పెరిగాయి. వచ్చే ఏడాది ఉగాది సందర్భంగా ఏప్రిల్ 5న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.