షర్ట్ విప్పి వక్షోజాలు చూపించమన్న డైరెక్టర్

0

కాస్టింగ్ కౌచ్.. టాలీవుడ్ వివాదాస్పద నటి శ్రీరెడ్డి వివాదం మొదలయ్యే వరకూ కూడా దీని గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. ఎప్పుడైతే ఇలా సినిమా ఇండస్ట్రీలో అవకాశాల పేరుతో వాడుకుంటారో అని తెలిసిందే అప్పుడే చర్చనీయాంశమైంది. కాస్టింగ్ కౌచ్ మన టాలీవుడ్ లోనే మొదలైన సంస్కృతి కాదు.. హాలీవుడ్ లో ఎప్పటినుంచో ఉంది.

తాజాగా ప్రముఖ ప్రపంచ ప్రసిద్ధ పాప్ స్టార్ జెన్నిఫర్ లోపెజ్ కూడా కాస్గింగ్ కౌచ్ కు గురైన వారేనని తెలిసింది. ఇటీవల హాలీవుడ్ నటులతో కలిసి ఓ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న జెన్నిఫర్ లోపేజ్ ఓ షాకింగ్ విషయం బయటపెట్టింది.

జెన్నిఫర్ మాట్లాడుతూ ఓ డైరెక్టర్ నన్ను షర్ట్ విప్పమని వక్షోజాలు చూపించమన్నాడని.. రొమ్ములు చేస్తానన్నాడని సంచలన విషయం చెప్పుకొచ్చింది. అసభ్యంగా చాలా సేపు మాట్లాడాడని తెలిపింది. కానీ తాను సెట్ లో మాత్రమే రోమాంటిక్ సీన్లలో షర్ట్ విప్పుతానని.. రూమ్ లో కుదరదని అతడికి స్పష్టం చేసినట్లు తెలిపింది.

నేను ధైర్యం చేసి నో చెప్పాను కాబట్టే అతడు వెనక్కి తగ్గాడని.. అప్పుడు నేను విప్పితే ఆ గదిలో ఇంకా డైరెక్టర్ చేతిలో తాను బలైపోయేదాన్ని అని జెన్నిఫర్ చెప్పుకొచ్చింది. నేను నో చెప్పేసరికి డైరెక్టర్ సారీ చెప్పి బయటకు వెళ్లిపోయాడని తెలిపింది. జెన్నిఫర్ లాంటి పాప్ స్టార్ కు కూడా లైంగిక వేధింపులు తప్పలేదనే విషయం తెలిసింది. ఈ విషయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ గా మారింది.
Please Read Disclaimer