‘జెర్సీ’ బ్యూటీ అప్పుడలా.. ఇప్పుడిలా

0

తెలుగు ప్రేక్షకులకు ‘జెర్సీ’ చిత్రంతో పరిచయం అయిన ముద్దుగుమ్మ శ్రద్దా శ్రీనథ్. ఈ అమ్మడు కన్నడంలో ‘యూటర్న్’ చిత్రంతో సౌత్ ఇండియా ఫిల్మ్ మేకర్స్ దృష్టిని ఆకర్షించింది. ఆ సినిమా తర్వాత తెలుగు.. తమిళం.. మలయాళం ఇలా సౌత్ ఇండియాలోని అన్ని భాషల్లో కూడా నటించే అవకాశాలు దక్కించుకుంది. సౌత్ లోని అన్ని భాషల్లో నటించిన అతికొద్ది మంది హీరోయిన్స్ జాబితాలో ఈ అమ్మడు కూడా ఉంటుంది. అయితే ప్రస్తుతం ఇంత అందంగా నాజూకుగా ఉన్న శ్రద్దా శ్రీనాథ్ గతంలో చాలా బొద్దుగా ఉండేదట.

సోషల్ మీడియాలో శ్రద్దా తన పాత ఫొటోను మరియు ప్రస్తుతం ఫొటోను కలిపి పెట్టి తాను బక్కగా అయ్యేందుకు పడ్డ కష్టాలు.. ఆ తర్వాత ఎదుర్కొన్న ఇబ్బందులు.. తీసుకున్న ఛాలెంజ్ లను సుదీర్ఘ పోస్ట్ లో చెప్పుకొచ్చింది. నేను న్యాయ శాఖలో పని చేస్తున్న సమయంలో ఒక సంవత్సరం గడిచింది. ఆ సమయంలో నేను మొదటి ఫారిన్ ట్రిప్ వెళ్లాను. అప్పుడు నా వద్ద కావాల్సినంత డబ్బు ఉంది. గతంలో ఎప్పుడు ఖర్చు చేయనంతగా నేను ఖర్చు చేశాను. ఇష్టం వచ్చింది తినడంతో పాటు.. చాలా ఖరీదైన డ్రస్ లు తీసుకుంటూ ఉండేదాన్ని. నన్ను నేనెప్పుడు చాలా అందంగా ఉంటానని భావిస్తాను.

నేను ఆసమయంలో పూర్తిగా ఎంజాయ్ చేయడమే తప్ప మరో పని చేసేదాన్నే కాదు. నెలకు కనీసం ఒక్కసారి కూడా వ్యాయామం చేయక పోవడంతో నేను బాగా బరువు ఎక్కాను. ఆ విషయం నాకు కూడా అర్థం అయ్యింది. అందుకే నేను ఉండే అపార్ట్ మెంట్ లోనే ఉన్న జిమ్ కు వెళ్లడం ప్రారంభించాను. మొదట అయిదు నిమిషాలు.. ఆ తర్వాత పది నిమిషాలు.. అలా అలా పెంచుకుంటూ రోజులో 40 నిమిషాలు నడవడం వర్కౌట్స్ చేయడం మొదలు పెట్టాను. అలా నేను 18 కేజీలు తగ్గాను. ఆ సమయంలోనే నేను అనారోగ్యం పాలయ్యాను.

అనారోగ్యంతో డైట్ ఫాలో అవ్వడం సాధ్యం అయ్యేది కాదు. అయినా కూడా నేను ఫిట్ గా ఉండేందుకు ప్రయత్నించాను. నేను ఇంత బరువు తగ్గడానికి.. అంత కష్టపడానికి కారణం ఒక్కటే. నేను చూడ్డానికి అందంగా ఉండాలని అనుకోవడమే. అలా అనుకోవడం వల్లే నేను బరువు తగ్గడంతో పాటు చాలా ఆరోగ్యంగా కూడా ఉండేలా వ్యాయామం చేసేదాన్ని అంటూ తన పోస్ట్ లో ఫాలోవర్స్ కు సలహాలు సూచనలు ఇవ్వడంతో పాటు తన సక్సెస్ జర్నీ చెప్పింది.
Please Read Disclaimer