‘ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్’కి ఎంపికైన నేచురల్ స్టార్ మూవీ!!

0

ఈరోజుల్లో మాస్ సినిమాలు మాస్ సీన్లను ఆదరిస్తున్న టైంలో.. ఎలాంటి మాస్ సీన్స్ లేకుండా.. మాస్ డైలాగ్స్ లేకుండా కేవలం హృదయం చలించిపోయే ఎమోషనల్ సీన్లతో ప్రేక్షకుల నుండి విజిల్స్ చప్పట్లు దక్కించుకున్న సినిమా జెర్సీ. నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన ఈ సినిమా గతేడాది ఏప్రిల్ నెలలో థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాను గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేసాడు. ఈ సినిమాలో ఓ ఫెయిల్డ్ క్రికెటర్గా.. అసమర్ధపు భర్తగా.. తండ్రిగా.. బరువైన నిజాన్ని బయటికి చెప్తే ఆ బాధను భరించలేరని తనలోనే దాచుకుంటూ.. పైకి నవ్వుతూ ప్రేక్షకులను ఏడిపిస్తూ నాని చేసిన నటన అద్భుతం అనే చెప్పాలి. ఒక నటుడిలోని ప్రతిభ ఏంటన్నది అతను చేసే పాత్ర ద్వారా బయటవస్తుంది. ఈ చిత్రంలోని నాని చేసిన పాత్ర అతని నటనకు పరీక్షే. తేడా అయితే డకౌట్.. ఓకే అయితే సిక్సర్ల మోత అనేలా తీర్చిదిద్దాడు డైరెక్టర్ గౌతమ్.

ఈ సినిమాలో శ్రద్ధ శ్రీనాథ్ హీరోయినుగా నటించగా సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. సినిమా చూస్తున్నంతసేపు అర్జున్ ఫ్యామిలీకి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారు. అన్నీ అతనికే ఇలా ఎందుకు జరుతున్నాయి. అర్జున్ గెలివాలని ప్రేక్షకులు కోరారంటే అర్థం చేసుకోవచ్చు. హృదయాలకు దగ్గరగా ఉందని. ‘జెర్సీ’ సినిమాను డైరెక్టర్ గౌతమ్ ఓ ఫెయిల్యూర్ స్టోరీని అందంగా ఎమోషనల్ జర్నీలా తీసుకెళ్ళాడు. ఈ సినిమాలో పాత్రలతో పాటు అవి పలికే సంభాషణలు కూడా హైలైట్ అని చెప్పాలి. మొత్తానికి సినిమా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. సూపర్ హిట్ అయింది. అయితే ఇప్పటి వరకు ఈ సినిమా చాలా ప్రశంసలు పురస్కారాలు అందుకుంది. కానీ తాజాగా జెర్సీ సినిమా ఇంటర్నేషనల్ ఇండియన్ టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శనకు ఎంపికైంది. ఇటీవలే ఈ విషయాన్నీ సినీవర్గాలు వెల్లడించాయి. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కి ఎంపికైందంటే జెర్సీ మరో ఫీట్ అందుకున్నట్లే అంటూ సినీప్రియులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. జెర్సీ టీమ్ కి దక్కిన గొప్ప గౌరవం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.