జెర్సీ బిజినెస్: న్యాచురల్ స్టార్ అనిపించాడుగా..!

0

న్యాచురల్ స్టార్ నాని తాజా చిత్రం ‘జెర్సీ’ విడుదలకు ఇంకా దాదాపు నెల రోజుల సమయం ఉంది. అయినా ఇంట్రెస్టింగ్ ప్రోమోలతో ఇప్పటికే సినిమాపై హైప్ ను పెంచారు ‘జెర్సీ’ మేకర్స్. దీంతో ఈ సినిమాపై ట్రేడ్ సర్కిల్స్ లో కూడా ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. అదే ఆసక్తి ప్రీ-రిలీజ్ బిజినెస్ కూడా జోరుగా జరగడంలో సహాయపడింది. రిలీజ్ కు మునుపే ఈ సినిమా ప్రాఫిటబుల్ వెంచర్ గా మారిందని సమాచారం.

ప్రొడ్యూసర్ నాగ వంశీ ‘జెర్సీ’ ని 22 కోట్ల బడ్జెట్ తో నిర్మించారట. ఇప్పుడు థియేట్రికల్ రైట్స్ బిజినెస్ మాత్రమే రూ. 30 కోట్లకు పైగా జరిగిందని ట్రేడ్ వర్గాల సమాచారం. దీనికి తోడు శాటిలైట్ రైట్స్.. డిజిటల్ రైట్స్.. హిందీ డబ్బింగ్ హక్కుల ద్వారా మరో రూ.12 కోట్ల రూపాయల బిజినెస్ జరిగిందట. అంటే ఓవరాల్ గా రూ. 42 + కోట్ల బిజినెస్ జరిగినట్టు. దీంతో ఈ సినిమా రిలీజ్ కు ముందే నిర్మాతలకు టేబుల్ ప్రాఫిట్స్ తీసుకొచ్చింది. నాని కెరీర్ లో కూడా ఇది రికార్డ్ బిజినెస్ అని ట్రేడ్ వర్గాల వారు అంటున్నారు.

ప్రొఫెషనల్ క్రికెటర్ గా తన సత్తా చాటేందుకు తపించే మధ్యవయస్కుడిగా నాని ఈ చిత్రంలో నటించాడు. ఈ సినిమాలో నాని సరసన శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా నటించింది. అనిరుధ్ రవిచందర్ సంగీత దర్శకుడు. గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాతో డైరెక్టర్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఏప్రిల్ 19 న ‘జెర్సీ’ రిలీజ్ కానుంది.
Please Read Disclaimer