అప్పు చేసి మరీ దానం చేసిన జాన్వీ

0

భిక్షగాళ్లకు 10 దానం చేస్తే తప్పేం లేదు. వాళ్లు కూడా బతకాలి కదా! కానీ ఆ మంచి మనసు ఎందరికి ఉంటుంది? ఇటీవలే అందాల రకుల్ ప్రీత్ ను ముంబై భిక్షగాడు దానం ప్లీజ్ అంటూ వెంటపడితే.. చిల్లి గవ్వ అయినా విదిలించకుండా.. నేరుగా కారు ఎక్కి ఎస్కేప్ అవ్వడం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. దీంతో నెటిజనులు రకుల్ ను ఓ రేంజ్ లో ఆడుకున్నారు. కోట్లలో సంపాదిస్తావ్..10 రూపాయలు బిక్షగాళ్లకు ఇవ్వలేవా? అంటూ చురకలు వేశారు. దానికి సంబంధించిన వీడియో కూడా జోరుగా వైరల్ అయింది. అయితే రకుల్ కు పూర్తి కాంట్రాస్ట్ గా వ్యవహరించి తన మంచి మనసు చాటు కుంది అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్.

జిమ్ లో వర్కవుట్లు ముగించుకుని ఇంటికి వెళ్తోన్న మార్గంలో ఓ బాలిక వెంట పడింది. జాన్వీ కారు ఎక్కడానికి వెళ్తుండగా తన వద్ద ఉన్న మ్యాగజైన్ కొనమాంటూ బ్రతిమలాడింది. దీంతో జాన్వీ ఎంతో ఆప్యాయంగా నవ్వింది. కారు వద్దకు వెళ్లి పర్సు తీసి డబ్బు కోసం వెతికింది. అందులో డబ్బు అందుబాటులో లేకపోవడంతో తన కార్ డ్రైవర్ ను అప్పు అడిగి మరీ దానం చేసి దాతృత్వాన్ని చాటింది. అంతేనా డబ్బులిచ్చిన తర్వాత చిరు నవ్వుతో బై చెప్పింది. జాన్వీ చేసిన మంచి పనికి నెటిజనులు ఫిదా అయ్యారు.

మామ్ శ్రీదేవి ఇలానే ఎంతో దయార్ధ్ర హృదయంతో వినయంతో వ్యవరించేదని అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. స్వర్గంలో ఉన్న అతిలోక సుందరి జాన్వీ చేసిన మంచి పని చూసి మెచ్చుకుంటారని కామెంట్ల రూపంలో తమ అభిమానం చాటుకున్నారు. ఈ సందర్భంగా రకుల్ ఎస్కేప్ అయిన సన్నివేశాన్ని కూడా గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం జాన్వీ కపూర్ పలు హిందీ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

 

View this post on Instagram

 

@janhvikapoor is really so kind and humble . I can’t express her kindness by words. #janhvikapoor #janhvikapoor06 #janhvians

A post shared by Janhvi Kapoor (@janhvikapoor06) on
Please Read Disclaimer