గుబులు పుట్టించిన నటవారసురాలు

0

ముంబైలో నటవారసుల హల్ చల్ గురించి తెలిసిందే. అందరిలోనూ ఫ్యాషనిస్టా జాన్వీకపూర్ ఓకింత స్పీడ్ చూపిస్తోంది. నిరంతరం ఈ భామ స్కిన్ టైట్ దుస్తుల్లో ఇచ్చే ట్రీట్ సామాజిక మాధ్యమాల్లో ఓ రేంజులో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. జిమ్ కి వెళ్లినా యోగా క్లాసులకు వెళ్లినా లేదూ పబ్లిక్ లో రెస్టారెంట్ కి వెళ్లినా జాన్వీ తీరు మాత్రం మారదు. అందుకే తనకోసం కెమెరా కళ్లు అంతే ఆత్రంగా వేచి చూస్తుంటాయి.

తాజాగా జాన్వీ పబ్లిక్ అప్పియరెన్స్ ఒకటి యువతరం గుండె లయ తప్పేలా చేసింది. తెల్లని ఛాయాచిత్రాలతో డిజైన్ చేసిన వెండి జాకెట్ ని ధరించిన జాన్వీని చూడగానే రాక్ స్టార్ ని తలపించింది. ఇక ఆ థై సొగసుల్ని ఎలివేట్ చేసే వైట్ అండ్ వైట్ పొట్టినిక్కరు కిర్రాక్ పుట్టించింది. ఆ చిట్టి పొట్టి దుస్తుల్లో నడుము మడతలు.. యాబ్స్ స్పష్టంగా కనిపిస్తుండడం పిచ్చెక్కిస్తోంది. ఇంతకీ అలా ఎక్కడికి వెళ్లింది? అంటే.. ముంబైలోని ఓ క్లినిక్ కు వెళుతోందట. అయితే ఎవరైనా డాక్టర్ దగ్గరకు వెళితే ఇలా కనిపిస్తారా? అంటూ యూత్ లో ఒకటే గుసగుస.

జాన్వీ నటించిన కార్గిల్ గర్ల్ రిలీజ్ కి రెడీ అవుతోంది. అలాగే తక్త్ అనే చిత్రం రెగ్యులర్ షూట్ కి వెళ్లాల్సి ఉంది. దోస్తానా 2 శరవేగంగా పూర్తవుతోంది. వీటితో పాటే మరిన్ని వరుస ప్రాజెక్టులతో 2020లో క్షణం తీరిక లేనంత బిజీగా ఉంది.
Please Read Disclaimer