జాన్వీ యాబ్స్ మతి చెడేలా

0

జీరో సైజ్ అనే ట్రెండ్ ఒకప్పుడు. బెబో కరీనా కాలంలో ఒకరిద్దరు నాయికలు రేర్ గా జీరో సైజ్ కోసం శ్రమించేవారు. కానీ ఇప్పుడలా కాదు. కథానాయికలంతా జీరో సైజ్ ని మించి ట్రై చేస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ యువకథానాయికలు ఈ విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు. బాడీని పర్ఫెక్ట్ ఫిట్ గా తీర్చిదిద్దేందుకు ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు. నిరంతరం జిమ్ముల్లో కసరత్తులు చేస్తూ అలుపన్నదే లేకుండా శరీరంలో ప్రతి అంగాన్ని తమకు నచ్చినట్టు మలుచుకుంటున్నారు.

ఇక ఇతర నాయికలతో పోలిస్తే శ్రీదేవి నటవారసురాలు జాన్వీ మరీ ఫిట్నెస్ ఫ్రీక్ అనే చెప్పాలి. పబ్బు.. క్లబ్బులో పార్టీలు.. విదేశీ షికార్.. లేదా షూటింగులు అంటూ రకరకాల బిజీల్లో ఉన్నా టైమ్ అయ్యేసరికి ఈ అమ్మడికి గంట కొట్టేస్తుంది. జిమ్ టైమ్ ని మాత్రం అస్సలు మిస్ చేయదు. అయితే ఆ డెడికేషన్ తోనే ఇదిగో ఇలాంటి అందమైన ఫిజిక్ ని తీర్చిదిద్దింది. శరీరంలో అంగాంగాన్ని వర్ణించేందుకు కొన్ని పేజీల పాఠం రాయాలేమో! అన్నంత వయ్యారంగా తన దేహాకృతిని మార్చేసింది.

జాన్వీ సొగసును కవులు వర్ణించాల్సిన అవసరమే లేదు. ఒకే ఒక్క ఫోటో చాలు జాన్వీ శ్రమ పర్ఫెక్ట్ పిట్ లుక్ అర్థం అవ్వడానికి. ఆ నడుము చుట్టూ అసలు పిసరంత బెల్లీ ఫ్యాట్ అయినా లేకుండా మొత్తం కరిగించేసింది. అంతేనా ఆ యాబ్స్ పర్ఫెక్ట్ గా హాలీవుడ్ నాయికల తీరుగా మార్చేసింది. ఈ స్ఫూర్తి తోనే యువతరం కళ్లు తనవైపు తిప్పేసుకుంటోంది జాన్వీ. ఇప్పటికే తొలి సినిమా ధడక్ లో నటిగా మెప్పించింది. ప్రస్తుతం ఒకేసారి మూడు నాలుగు సినిమాలతో బిజీగా ఉంది. గుంజన్ సక్సేనా బయోపిక్ ది కార్గిల్ గర్ల్ త్వరలో రిలీజ్ కి రానుంది. అలాగే రూహ్ అబ్జా అనే చిత్రంలో నటిస్తోంది. కరణ్ జోహార్ దోస్తానా 2 పంజాబ్ షెడ్యూల్ ని జాన్వీ ఇటీవల ముగించింది. ఇక వీటితో పాటు భారీ హిస్టారికల్ చిత్రం తక్త్ లోనూ నటించనుంది.
Please Read Disclaimer