జిమ్ డ్రెస్ లో స్టార్ డాటర్ కవ్వింత!

0

ఫేజ్ 3 ప్రపంచంలో గ్లామర్ అండ్ గ్లిజ్ లోకంలో స్టార్ కిడ్స్ ఎలా ఉండాలి? అంటే అందుకు జాన్వీ వ్యవహారమే ఫక్తు ఎగ్జాంపుల్. నిరంతరం జనాల కళ్లు తమపైనే ఉండాలంటే ఏం చేయాలో అది చేయాలి. జిమ్ కి వెళ్లినా.. షాపింగ్ కి వెళ్లినా లేదా పార్కుకి వెళ్లినా యూత్ కళ్లన్నీ తమపైనే వాలిపోవాలి. అందుకు తగ్గట్టే వేషధారణను ప్లాన్ చేయాలి. చిట్టి పొట్టి దుస్తుల్లో చిలౌట్ చేయాలి.

ఇదిగో తాజాగా ముంబైలో జిమ్ కి వెళుతూ జాన్వీ ఇలా కంట పడింది. ఈ తరహాలో టైట్ ఫిట్ స్పోర్ట్స్ దుస్తుల్లో దర్శనమివ్వడం జాన్వీకి ఇదే తొలిసారి కాదు. ముంబై వీధుల్లో రెగ్యులర్ గా ఇలా దర్శనమిస్తూ యూత్ కి ట్రీటిస్తోంది. పచ్చ రంగు స్పోర్ట్స్ వేర్ కి.. కాంబినేషన్ బ్లాక్ మెస్ షార్ట్ తో మతి చెడగొట్టింది.

ఇక కెరీర్ పరంగా చూస్తే.. జాన్వీ తొలి సినిమా ధడక్ రిలీజై ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా కోస్టార్ అయిన షాహిద్ సోదరుడు ఇషాన్ ఖత్తర్ తో కలిసి మరో చిత్రంలో నటించేందుకు రెడీ అవుతోంది. అలాగే
పలు క్రేజీ చిత్రాల్లో నటిస్తూ ఇటీవల హాట్ టాపిక్ గా మారింది. దేశంలో తొలి లేడీ పైలెట్ గుంజన్ సక్సేనా జీవితకథలో నటిస్తున్న జాన్వీ వరుసగా కార్గిల్ గాళ్.. రూహి అఫ్జా (హారర్ కామెడీ) చిత్రాల్లో నటిస్తోంది. అలాగే కరణ్ జోహార్ దర్శకత్వం వహించనున్న `తక్త్` అనే భారీ హిస్టారికల్ చిత్రంలో నటించనుంది. రుహి అఫ్జా చిత్రంలో జాన్వీ సరసన రాజ్ కుమార్ రావ్ నటించనున్నారు. ఆగ్రా.. మనాలీ షెడ్యూల్స్ పూర్తయ్యాయి. హార్ధిక్ మెహతా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మార్చి 2020లో ఈ సినిమా రిలీజ్ కానుంది.
Please Read Disclaimer