ఫోటో స్టొరీ: 100 పర్సెంట్ క్యూట్ నెస్

0

బాలీవుడ్ స్టార్ కిడ్స్ చాలామంది ఇప్పుడు హీరోయిన్లుగా తమ సత్తా చాటుతున్నారు. కొంతమంది ఇప్పుడిప్పుడే బాలీవుడ్ లో తమ ప్రయాణాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు. శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వి కపూర్ ‘ధడక్’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఇంకా రెండవ సినిమా రిలీజ్ కాలేదు. అయితే క్రేజ్ విషయంలో మాత్రం చాలామంది స్టార్ కిడ్స్ కంటే ముందుంది. జాన్వి అలా నడుచుకుంటూ బయటకు వస్తే చాలు ఫోటోలు తీస్తారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారతాయి.

జాన్వి తన జిమ్ వేర్ తో ఎంత హాట్ టాపిక్ గా మారుతుందో అందరికీ తెలిసిందే. చిట్టి పొట్టి డ్రెస్సులు వేసుకొని ఫ్యాషన్ ను రంగరిస్తూ జిమ్ బయట వేచి చూస్తున్న జనాలకు అలా నాలుగు పోజులిచ్చి వెళ్ళిపోతుంది. తాజాగా జాన్వి ముంబై లో పైలేట్స్ క్లాసుకు వెళ్తూ ఉంటే అలానే ఫోటోలు తీయడం జరిగింది. జాన్వి కూడా ఇది మామూలే అన్నట్టుగా చిరునవ్వులు రువ్వుతూ ఎంతో ప్లెజెంట్ గా పోజిచ్చింది. అయితే ఈ సందర్భంగా ఆమె ధరించిన డ్రెస్ రెగ్యులర్ గా ఉండే షార్ట్ డ్రెస్ కాదు.. వెరైటీగా ఉంది. వైట్ కలర్ లో ఉండే లాంగ్ గౌన్.. స్లీవ్ లెస్ కావడంతో ఎంతో స్టైలిష్ గా ఉంది. మేకప్ లేకపోవడంతో ఎంతో సహజంగా కనిపిస్తోంది. సడెన్ గా చూస్తే.. అతిలోక సుందరి ఆత్మ అవహించిందా అని అనుమానం వచ్చే అవకాశం ఉంది.

ఈ ఫోటోలను వైరల్ భయాని అనే ఆధునిక సామాజిక మాధ్యమ ఛాయాచిత్ర తత్వవేత్త తన ఇన్స్టా ఖాతా ద్వారా షేర్ చేయడంతో లైక్స్ హోరెత్తాయి. కామెంట్లకు కూడా కొదవలేదు. ఒకరు “మేకప్ లేకుండా కూడా ఏంజెల్ లా ఉన్నావు”.. “పైలేట్స్ ఎక్సర్ సైజుకు తగిన డ్రెస్సు”.. “100% క్యూట్ నెస్”.. “డాటర్ ఆఫ్ శ్రీదేవి” అంటూ కామెంట్లు పెట్టారు. ఇక జాన్వి సినిమాల విషయానికి వస్తే ‘గుంజన్ సక్సేనా’.. ‘తఖ్త్’ చిత్రాలలో హీరోయిన్ గా నటిస్తోంది.
Please Read Disclaimer